తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్టు లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఆరవ సీజన్లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి మళ్ళీ పదవ వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ప్రసారం అవుతున్న ఆరవ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని రసవత్తరంగా సాగాయని మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా నామినేషన్ టాస్కులు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలోనే 12వ వారం నామినేషన్ టాస్క్ మీద అందరిలో ఆసక్తి నెలకొంది . ముఖ్యంగా ఈ షో మొత్తంలోనే నామినేషన్ టాస్క్ చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిసారి కొత్తగా డిజైన్ చేస్తున్నారు బిగ్బాస్ నిర్వాహకులు.

Bigg Boss 6 Telugu Launch Updates: Sri Satya Entered As BB6 Sixth Contestant - Sakshiఇక 12వ వారానికి సంబంధించి ఒక్కొక్క కంటెస్టెంట్ ను కన్ఫర్మేషన్ రూమ్ కి పిలిచి తాను నామినేట్ చేసే ఇద్దరు సభ్యుల ఫోటోలను శ్రెడ్డర్ లో వేయాలి అని బిగ్బాస్ చెబుతాడు. అలాగే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుందని కంటెంట్లకు తెలిపాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఆరవ సీజన్లో కూడా నామినేషన్స్ టాస్క్ కూడా రచ్చ రచ్చగా సాగుతున్నాయి.అయితే ఇప్పుడు కన్ఫర్మేషన్ రూమ్ కి పిలిచి ఈ టాస్కులు నిర్వహించడంతో పెద్దగా గొడవలు జరగలేదని చెప్పవచ్చు. అయితే రాజ్ ను నామినేట్ చేసే సమయంలో శ్రీ సత్య సరైన కారణాలు చెప్పలేదని.. ఆమెను బిగ్ బాస్ మందలించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ వారంలో ఇనయా, శ్రీహన్ , రోహిత్ , ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, రాజశేఖర్, శ్రీ సత్యలు నామినేషన్ లో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. రేవంత్ ఎలాగో కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ఈవారం నామినేషన్స్ నుంచి ఆయన తప్పించుకున్నట్లే. మరి మిగతా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *