బిగ్ బాస్ ఆరవ సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 21 మంది కంటెస్టెంట్ లలో ఒకరిగా వచ్చిన వాసంతి కృష్ణన్ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈ గేమ్ షో కి వెళ్లడంతోనే ఆమె బాగా ఫేమస్ అవుతూ వచ్చింది. అంతకుముందు సీరియల్స్ లో సోషల్ మీడియాలో రాణిస్తున్న కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు. బిగ్బాస్ పుణ్యమా అని ప్రేక్షకులకు పరిచయం అవడంతో పాటు భారీగా పాపులారిటీని కూడా దక్కించుకుంది. సీరియల్ ద్వారా కొంతమందికి మాత్రమే పరిచయమైన వాసంతి బిగ్ బాస్ ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు.

అంతేకాదు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో బేబీ డాల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది వాసంతి.చూడ చక్కని రూపంతో ఆకట్టుకున్న వాసంతి బిగ్ బాస్ తో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ లో 70 రోజులు ఉన్న వాసంతి రీసెంట్గా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇక బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఇంటర్వ్యూ లతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది.

బిగ్బాస్ హౌస్లో టాప్ ఫైవ్ లో ఒకరిగా ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అయితే హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మాకు ఒక అంచనా ఉండేది .దాంతో కాస్త రిలాక్స్ అయ్యే వాళ్ళము.కానీ ఎప్పుడైతే గీతూ , సూర్య ఎలిమినేట్ అయ్యారో అప్పుడు మాకు టెన్షన్ మొదలైంది. మా అంచనాలను తలకిందులు చేస్తూ ఎలిమినేషన్ జరిగింది. దాంతో మాకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టెన్షన్ కూడా మొదలయ్యింది.

బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు మెంటల్ టెన్షన్ ఎక్కువ . బరువు కూడా తగ్గుతారు.హౌస్ లో ఉన్నవారికి సరిపోయేంత ఫుడ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి.. కానీ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాం అన్న టెన్షన్ తోనే బరువు తగ్గిపోతాము. నేను కూడా 53 కేజీల నుంచి 47 కేజీలకు తగ్గాను.. నా డ్రెస్సులు కూడా లూస్ అవుతున్నాయి అంటూ తెలిపింది వాసంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *