నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి కి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఓ స్టార్ హీరో వల్ల బాలకృష్ణకి ఓ హీరోయిన్ తో సినిమా చేసే ఛాన్స్ రాలేదట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. విషయంలోకి వెళ్తే..నందమూరి బాలకృష్ణ హీరోయిన్ రాధిక కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎందుకు రాలేదు అనే దానిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్టు ఇమంది రామారావు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇమంది రామారావు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో బాలకృష్ణ చిరంజీవి మధ్య స్నేహబంధం పెరిగింది. చిరంజీవి రాధిక కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అలాగే బాలకృష్ణ తన సరసన నటించే హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ కూడా మంచి మంచి హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటారు.

అయితే బాలకృష్ణ తన సినిమాలో ఎప్పుడూ కూడా రాధిక ను హీరోయిన్ గా తీసుకోలేదు. దీనికి కారణం బాలకృష్ణ రాధికను తీసుకోవాలని అనుకోలేదు కావచ్చు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. బాలకృష్ణ ఎక్కువగా విజయశాంతి తో సినిమాలు చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వల్లే రాధిక బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు అని ఇప్పటికే చాలామంది ప్రచారం చేస్తున్నారు. కానీ చిరంజీవి వల్ల వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు అనే ప్రచారం లో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి ప్రచారం మాత్రమే.బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో కాంబినేషన్ నన్ను చాలా ఆకట్టుకుంది.

అలాగే సీరియస్ గా ఉండే రాజకీయ నాయకులను ఆయన షో కి పిలిపించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్, జయసుధ,చిరంజీవి వంటి స్టార్స్ కి కూడా ఈ షోకి వచ్చే అవకాశం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ ఉన్న గెస్టులు ఈ షోలో పాల్గొనబోతున్నారు అంటూ ఇమంది రామారావు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇమంది రామారావు గారు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *