సౌత్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ఈమె నుంచి చివరిగా వచ్చిన `నిశ్శబ్దం` సినిమా ఓటీటీ ద్వారా విడుద‌ల అయింది.

కానీ, ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత వ్యక్తిగత కారణాలుతో పాటు కరోనా విరామం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. లాంగ్ గ్యాప్ అనంతరం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తన 48వ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా కనిపించబోతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు మహేష్ పి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇందులో అనుష్క అన్విత రవ‌ళి శెట్టి అనే చెఫ్ పాత్రలో నటిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క త‌దుప‌రి ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. బోల్ట్ హీరోయిన్ అమలా పాల్ మాజీ భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో అనుష్క తన నెక్స్ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతోంద‌ట‌.

ఇప్పటికే విజయ్ ఓ కథను అనుష్కకు వినిపించాడట. అది బాగా నచ్చడంతో తన 49వ సినిమాను విజయ్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై బిగ్‌ అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ల‌నుంద‌ని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే అనుష్క అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *