ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆది పురుష్… రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా టీజర్ చూసిన ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. బొమ్మలతో గారడి చేశారు అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే టీజర్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ చాలా చీప్ గా ఉన్నాయని.. వీఎఫ్ఎక్స్ కన్నా చోటా భీమ్ లాంటి కార్టూన్స్ లో యానిమేషన్ చాలా బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు.

Adipurush Teaser: Hope the teaser is just teasing us, and ...టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయాయని ప్రభాస్ లుక్ అసలు బాగోలేదని కూడా కామెంట్లు వినిపించాయి. దీంతో పునరాలోచనలో పడ్డ డైరక్టర్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. రావణాసురుడి లుక్ మతపరంగా కొంతమంది మనోభావాలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో రావణ్ గా కనిపించే ప్రతి సన్నివేశాన్ని రీ షూట్ చేయడం కష్టం కాబట్టి వీఎఫ్ఎక్స్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీజర్ లో ఉన్న తప్పిదాలను వెతికి కొత్త అవుట్ పుట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా వర్క్స్ కారణంగా ఇప్పుడు వాయిదా వేశారు. మొత్తానికి జూన్ 16 2023న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ముఖ్యంగా ఆది పురుష్ కోసం భారీ తారాగణం ఎంచుకున్న దర్శక నిర్మాతలు ఇందులో సైఫ్ అలీ ఖాన్ , దేవదత్త నాగే, సన్నీ సింగ్ లను ఈ ప్రాజెక్టులో భాగం చేయడం… దీంతో ఈ సినిమాపై అభిమానులలో బోలెడు ఆశలు రేకెత్తుతున్నాయి.

మరి అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కిస్తారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ ఆది పురుష్ సినిమాను 3d ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా సక్సెస్ అయితే బాహుబలి లాంటి సక్సెస్ లభించినట్టే అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *