తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి కూడా పరిమితంగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కెరియర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన చాలా విషయాలను చెప్పుకొచ్చింది.. కవిత మాట్లాడుతూ.. నా భర్త మైండ్ సెట్ , నా మైండ్ సెట్ ఒకటే… నమ్మి మోసపోయామని.. అది తలుచుకుంటే బాధ వేస్తోందంటూ కవిత వెల్లడించింది.

Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం... ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి | Senior actress kavithas son dies of covid 19 husband in ...

డబ్బు అప్పు అడిగితే ఎవరికైనా ఇవ్వచ్చు.. కానీ పిల్లల కూడా నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చి అక్షింతలు వేయించుకున్నామని కవిత తెలిపింది. కోర్టులో జడ్జి కూడా మమ్మల్ని చూసి నవ్వారు అంటూ ఆమె మరింత ఎమోషనల్ అయింది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారంటే మా పిల్లలు కూడా సహాయాలు చేయాలని భావిస్తారని ఆమె వెల్లడించింది. నేను చాలా సినిమాలలో స్విమ్ సూట్స్ వేసుకున్నానని.. మొదటిసారి స్విమ్ సూట్ వేసుకున్నప్పుడు అన్ కంఫర్టబుల్గా ఫీలయ్యానని కవిత తెలిపింది.. ఇదే కాదు ఎన్నో రకాల మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నానని తెలిపిన ఆమె, గ్లామర్ గా ఉండే డ్రస్సులకు నేను ప్రాధాన్యత ఇచ్చాను అంటూ తెలిపింది.

నేను , శ్రీదేవి ఎక్కువగా మోడ్రన్ అవుట్ ఫిట్స్ వేసుకున్నామని.. జయసుధ, జయప్రద మోడ్రన్ డ్రెస్సులు తక్కువగా వేసుకున్నారని కవిత వెల్లడించింది ఇక మోహన్ బాబు గారితో 9 సినిమాలు చేశానని చెప్పిన ఈమె.. ఆ సమయానికి ఎలా ఉండాలో అలా ఉన్నామని కూడా తెలిపింది.అంతేకాదు కుటుంబంలో ఐదుగురు ఉన్న వాళ్ళం ఇప్పుడు ముగ్గురం అయ్యామని ఏడుస్తూ కవిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కవిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

కవిత ఈ మధ్యకాలంలో వరుస సినిమాలో చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా తల్లి , అత్త, వదిన క్యారెక్టర్లు పోషిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది . కానీ తాజాగా ఈమె చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా వీరి మాటలపై ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *