టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న హీరో తేజ సజ్జ. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయన హీరోగా గతంలో ‘జాంబీ రెడ్డి’ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, అతనితోనే ‘హను మాన్’ అనే మరో సినిమాను రూపొందించాడు.

తన చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమా ను సూపర్ హీరో కాన్సెప్టుతో తయాఋ చేయగా ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా అమృత అయ్యర్ అలరించనుండగా, కీలకమైన పాత్రలు వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయ్యింది.

ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలను ఇది పెంచింది అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *