టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలైన ఎన్టీఆర్, అక్కినేని బయటకు కనిపించకపోయినా స్వతహాగా వారిద్దరూ మంచి స్నేహితులు. రాజకీయాల్లోకి వెళ్దామని ఎన్టీఆర్ చెప్పినప్పుడు అక్కినేని ఆసక్తి లేకపోవడంతో ఎన్టీఆర్ ఒక్కడే ఒంటరిగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. తొమ్మిది నెలల్లోని సీఎం అయిపోయారు. అయితే అక్కినేని ఎన్నిసార్లు రమ్మని చెప్పినా రాజకీయాల్లోకి రాలేదని ఎన్టీఆర్కి మనసులో బాధ ఉండేది. కానీ ఒకసారి రవీంద్రభారతిలో ఏదో ఒక ప్రోగ్రాం లో ఉపన్యాసం ఇస్తూ కాషాయం కట్టుకున్న వారెవరు సన్యాసులు కారు అంటూ ఏదో ఫ్లోలో చెప్పేసాడు అక్కినేని.

కానీ అప్పటికే ఎన్టీఆర్ సంసార జీవితం వద్దని .. ఆస్తులను కొడుకులకు పంచి కాషాయ వస్త్రాలను ధరించారు. అయితే రవీంద్ర భారతిలో ఉపన్యాసం జరుగుతున్న సమయంలో అక్కినేని మాటలను ఎవరో ఎన్టీఆర్కి తప్పుగా మోసారు. అయితే ఎన్టీఆర్ ని ఉద్దేశించి అక్కినేని ఈ వాక్యాలు చేశారు అంటూ చెప్పడంతో ఆ మాటలను ఎన్టీఆర్ నమ్మేశారు . దాంతో ఎన్టీఆర్కి అక్కినేని పై చాలా కోపం ఏర్పడింది .రవీంద్ర భారతి లో అక్కినేని ఎలాంటి స్పీచ్ ఇచ్చినా ఆ టేప్ తనకు పంపాలని ఎన్టీఆర్ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆర్డర్ వేశారు.

ANR Bigger Than NTR? | cinejosh.com

ఈ విషయం అక్కినేని కి కూడా చేరిపోయింది. ఇక తాను ఆ ఉద్దేశంతో అనలేదు కాబట్టి ఆ వ్యాఖ్యలను అంత సీరియస్గా తీసుకోలేదు అక్కినేని. కానీ ఎన్టీఆర్కి మాత్రం అప్పటినుంచి అక్కినేని పై కోపం పెరుగుతూనే వచ్చింది. అయితే ఎన్టీఆర్ తనను ఈ విషయం గురించి అడిగి సమస్య సాల్వ్ చేసుకుని ఉండి ఉంటే బాగుండేది అని అక్కినేని చాలాసార్లు అనుకున్నారు. కానీ అది జరగలేదు. అప్పటినుంచి మూడేళ్ల పాటు రవీంద్రభారతిలో అక్కినేని అడుగు పెట్టలేదు.

రెండోసారి ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా అక్కినేనికి ఎన్టీఆర్ ఆహ్వానించినా.. మొక్కుబడిగా ఆయన వెళ్లకుండా నాగార్జున ను పంపించారు. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియో పైన కూడా ఎన్టీఆర్ కొన్ని కేసులు నమోదు చేశారు. అలా వీరిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది . కానీ కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ అక్కినేనినీ ఇంటికి పిలిపించి సారీ చెప్పడంతో ఇద్దరి మధ్య సమస్య సద్దుమణిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *