ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియా శరన్. ఇక మొదటి సినిమా ఈమెకు అంతగా పేరు తెచ్చి పెట్టకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సంతోషం సినిమాతో మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున సరసన ఈమె సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఈ హీరోయిన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.ఇక ఈ సినిమా తర్వాత శ్రియ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. శ్రీయ తన సినీ కెరియర్లో ఏకంగా 70కి పైగా సినిమాల్లో నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఈమె 2007లో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ మూవీ యూనిట్ ఓ సక్సెస్ మీట్ పెట్టారు. దాంతో 2008వ సంవత్సరంలో జనవరి 11న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫంక్షన్ కి శ్రీయ చాలా బోల్డ్ డ్రెస్ లో రావడంతో ఆమె మీదే అందరి కళ్ళు పడ్డాయి. ఇక ఆమెను ఆ డ్రెస్ లో చూసిన తమిళ జనాలు అందరూ నోరెళ్ళబెట్టారు.

ఆమె వేసుకున్న డ్రెస్ లో కొంచెం ఫెదర్స్ లాగా ఉండే మెటీరియల్ ఉండి పొట్టి డ్రెస్ ఉండడం వల్ల ఆ డ్రెస్ లో ఆమె అందాలన్నీ కనిపించాయి. ఇక శ్రీయ ను ఆ డ్రెస్ లో చూసిన తమిళ్ జనాలందరూ షాక్ అయ్యారు. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ ను అప్పటి తమిళనాడులో ఉన్న ఓ రాజకీయ పార్టీ వ్యతిరేకించింది. ఆమె వేసుకున్న డ్రెస్ హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఉందని,సాంప్రదాయాలు మంట కలుపుతూ అలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని జనాలందరి ముందుకు రావడం ఏం బాగాలేదు. అలాంటి బోల్డ్ డ్రెస్సులు వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటుంది అంటూ తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక వారి కోపానికి బలైన శ్రియ చేసేదేమీ లేక తాను అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు క్షమాపణలు చెప్పి వారి కోపాన్ని శాంతింప చేసిందట. ఇలా జరుగుతుందని నాకు తెలియక అలాంటి డ్రెస్ వేసుకున్నాను. అంతేకాదు నేను ఓ హిందీ మూవీ షూటింగ్లో ఉన్నాను. ఇక షూటింగ్ నుండి నేరుగా ఈ ఫంక్షన్ కి రావడం వల్లే ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీయా క్లారిటీ ఇచ్చింది. దీంతో గొడవ అక్కడి తో సద్దుమణిగింది. ప్రస్తుతం శ్రీయ సినిమాలకు దూరంగా ఉంటుంది. కరోనా టైంలో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్ర వస్తే మళ్లీ రీ ఎంట్రి ఇస్తానని చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *