`వెళ్ళిపోమాకే` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` దాస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు దర్శకుడుగా, రచయితగా, సహా నిర్మాతగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన `హిట్` సినిమా హిట్ అవ్వడంతో హీరోగా నిల‌దొక్కుకున్న విశ్వ‌క్ సేన్‌.. రీసెంట్‌గా `ఓరి దేవుడా` సినిమాతో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేసాడు.

అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు నివేదా పేతురాజ్. వీరిద్దరూ జంటగా తొలిసారి `పాగల్` సినిమాలో నటించారు. ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అలాగే ఇందులో విశ్వక్ సేన్‌-నివేదా కెమిస్ట్రీ కూడా బాగా పండింది.

అయితే మళ్లీ తాజాగా వీరిద్దరూ క‌లిసి `దాస్‌ కా దమ్కీ` సినిమాలో న‌టించారు. విశ్వక్ సేన్ హీరోగా నటించినమే కాదు ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. వన్మ‌యూ క్రియేషన్స్‌, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ట్రైలర్ ను లాంఛ్ చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ట్రైలర్ లో విశ్వక్ మరియు నివేదా మధ్య కెమిస్ట్రీ చూస్తే.. వీరు నిజంగా ప్రేమలో ఉన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అంతలా వీరిద్దరూ అట్రాక్ట్ చేశారు. ఇంకేముంది నివేదాతో విశ్వ‌క్‌ ప్రేమలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. పైగా వీరిద్దరూ వరుసగా క‌లిసి సినిమాలు చేస్తుండడంతో నెట్టింట‌ జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో వీరి ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. మ‌రి వీరి ప్రేమ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే విశ్వక్, నివేదాలు స్పందించాల్సిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *