డైరెక్టర్ కొరటాల శివ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. ఇక ఈ మధ్యన ఆచార్య డిజాస్టర్ కావడంతో ఈయన పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ ఆ తర్వాత డైరెక్షన్ విభాగంలో డైరెక్టర్గా అడుగు పెట్టారు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్. అయితే ఈయనకు ఫ్లాఫ్ లేని డైరెక్టర్ గా పేరు కూడా వచ్చింది. కానీ ఆచార్య సినిమా తప్ప ఈయన తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్.

ఈయన ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. అయితే ఈయన డైరెక్టర్ గా సక్సెస్ కావడానికి వెనుక తన భార్య ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక కొరటాల శివ భార్య వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన భార్య పేరు అరవింద. ఈమె లండన్ లో చదువుకున్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఈమెలో ఉన్న నిజాయితీని చూసి కొరటాల ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు పిల్లలు లేరు.

ఇక ఈ విషయంలో వీరు ఇప్పటికి బాధపడుతుంటారు. ఇక పిల్లలు లేకపోవడంతో అరవింద సమాజంలో ఉన్న చిన్నపిల్లలందరూ తమ బిడ్డలు గానే భావిస్తుందట. ఇక అరవింద స్వతహాగా మొదటి నుండి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావడంతో ఆమెకి సేవ గుణం ఎక్కువ. అలాగే కొరటాల శివ శ్రీమంతుడు సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన భార్యేనట. ఆమె ఎప్పుడూ కూడా సంపాదించిన దాంట్లో అవసరం ఉన్నంత ఉంచుకొని మిగతాదంతా సమాజానికే తిరిగి ఇచ్చేయాలి అనే ఒక ఫిలాసఫీని నమ్ముతుందట. ఇక ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ శ్రీమంతుడు సినిమా తీశారట.

అందుకే కొరటాల శివ అన్ని కోట్లు సంపాదిస్తున్నా కూడా కేవలం ఒక చిన్న అపార్ట్మెంట్లోనే నివసిస్తాడు.ఇక వీరు సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం సమాజ సేవకు ఉపయోగిస్తూ సంతోషాన్ని పొందుతారు. అంతేకాదు కొరటాల శివ ఇప్పటికే ఎన్నోసార్లు నాకు డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి భార్య కి భర్తగా ఉన్నాననే ఆనందమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ భార్య గురించితెల్సిన నెటిజన్లు ఈ డైరెక్టర్ భార్య ఇంత మంచిదా అని ఆమెను మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *