సుడిగాలి సుధీర్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వెండితెర మీద హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈయన జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే మల్లెమాలు వారు చేసే ఏ ఈవెంట్ లోనైనా సుధీర్,రష్మి తో కలిసి రొమాన్స్ చేస్తూ బుల్లితెర మీద బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సుధీర్ జబర్దస్త్ ను వదిలేసి స్టార్ మా కి వెళ్లారు. అయితే ఆర్థిక పరిస్థితులు ఉన్నందువల్లే ఎక్కువ డబ్బుల కోసం వేరే ఛానల్ కి వెళ్లాలని సుధీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు మళ్లీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రి ఇవ్వడానికి కూడా మల్లెమాల వారితో చర్చలు జరుపుతున్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ కు షోకు మళ్ళీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఒక కొత్త షో కి యాంకర్ గా చేస్తున్నారు.అదే ఆహాలో ప్రసారమయ్యే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ షో తో జబర్దస్త్ కు పోటీగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో రాబోతుంది అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ షోలో సుడిగాలి సుదీర్ తో పాటు యాంకర్ దీపికా పిల్లి కూడా చేస్తోంది. ఇక ఈ షోకి జడ్జిగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు.

అయితే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ అయిన ముక్కు అవినాష్,టిల్లు వేణులతో పాటు పటాస్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన యాదమ్మ రాజు, సద్దాం హుస్సేన్, హరి, జ్ఞానేశ్వర్, భాస్కర్ వంటి కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా ఉన్నారు. ఇక ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి తో పాటు ఈ షోలోకి వచ్చే ప్రేక్షకులు కూడా కమెడియన్స్ చేసే పర్ఫామెన్స్ కి మార్కులు ఇస్తారు. ఇక ప్రేక్షకుల ఓటింగ్ తోనే విజేత ఎవరు అనేది తెలుస్తుంది. ఇక తాజాగా విడుదలైన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. దాంతో ఈ షోపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది.

ఇక ఈ విషయంలో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో షోలోకి వస్తా వస్తా అంటూ మళ్లీ వేరే షోలోకి వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ లో రియంట్రీ ఇవ్వాలని సుడిగాలి సుదీర్ అభిమానులు కోరుకుంటుంటే సుధీర్ మాత్రం ఎవరు ఊహించని విధంగా అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ నేపథ్యంలోనే సుధీర్ ఇక ఎప్పటికి జబర్దస్త్ లోకి రాకపోవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే జబర్దస్త్ షో కి పోటీగా అదుర్స్, కామెడీ స్టార్స్ వంటి కామెడీ షోలు కూడా వచ్చాయి. కానీ ఇవేవీ కూడా జబర్దస్త్ షో కి పోటీగా నిలవలేకపోయాయి. అయితే తాజాగా రాబోతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ఏ విధంగా సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ షో డిసెంబర్ 2న ఆహలో ప్రసారం కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *