న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళంలో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. పైగా `ఫిదా` సూపర్ డూపర్ హిట్ అవ్వ‌డంతో సాయి పల్లవికి ఆఫ‌ర్లు క్యూ కట్టాయి.

దాంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత‌ ఏడాది `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఈ ఏడాది `విరాట పర్వం`, `గార్గి` చిత్రాలతో సక్సెస్ జోరును కొనసాగించాలని భావించింది.

కానీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ సినిమాలు మంచి విజ‌యం సాధించ‌క‌పోయినా.. సాయి పల్లవి నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఏమైందో ఏమో గాని ఇటీవ‌ల‌ సినిమాల ఎంపికలో సాయి పల్లవి మున‌ప‌టి జోరును చూపించ‌డం లేదు. అసలు గార్గి విడుదల తర్వాత సాయి పల్లవి నుంచి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. అయితే తాజాగా సాయి పల్లకి సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేమిటంటే సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట.

సాయి పల్లవి ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డాక్టర్ చదివిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టి.. వైద్య వృత్తిని స్వీకరించాలని భావిస్తుందట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా తనకు నచ్చిన పాత్రలు వస్తేనే సినిమాలు చేస్తానని, లేదంటే వైద్య వృత్తిని కొనసాగిస్తానని వెల్లడించింది. అదే ఇప్పుడు నిజం కాబోతోందట. సాయి పల్లవి ప్రస్తుతం సొంతంగా హాస్పిటల్ పెట్టబోతోందట. కోయంబత్తూర్ లో హాస్పిటల్ నిర్మించి ప్రజలకు సేవ చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హాస్పిట‌ల్ నిర్మాణం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకునే ప‌నిలో ప‌డింద‌ని.. అందుకే కొత్త సినిమాల‌కు సైన్ చేయడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *