యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన‌ `సవ్యసాచి` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. యూత్ లో మంచి క్రేజ్ కూడా ఏర్ప‌డ్డింది. ఈ సినిమా తర్వాత నిధి దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు ద‌క్క‌డం లేదు. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా `హరిహర వీరమల్లు` అనే సినిమా చేస్తుంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో పట్టాలెక్కింది. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాలేదు. ఎప్ప‌టికి కంప్లీట్ అవుతుందో కూడా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. ఇక టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కోలీవుడ్ లో మాత్రం నిధి అగర్వాల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా తమిళ హీరో, సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు జోడిగా `కలగ తలైవన్` అనే సినిమా చేసింది. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

నవంబర్ 18న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి త‌మిళ‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మగిజ్ తిరుమేని తనని ఆడిషన్ చేసిన తీరును వివ‌రిస్తూ నిధి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒకరోజు తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని నిధి అగర్వాల్ కు ఫోన్ చేశారట. సినిమా గురించి మాట్లాడాలని చెప్పగా.. నిధి వెంటనే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌.

అయితే నిధిని చూసిన వెంటనే ముఖం కడుక్కో అంటూ కలగ తలైవన్ ముఖం పైనే చెప్పారట. మొదట ఆయన మాటలకు నిధి షాక్ అయిందట. కాస్త అవ‌మానంగా కూడా ఫీలైంద‌ట‌. అయితే ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాలట. అందుకే ఆయన చూడ‌గానే మేకప్ తీసేయమని చెప్పారట. మేకప్ తొలగించి ముఖాన్ని వాష్ చేసుకున్న వెంటనే ఆయన నిధి ముఖ కవళికలను మాత్ర‌మే ఫోటోషూట్ చేశారట. ఈ విషయాన్ని నిధి స్వయంగా తెలిపింది. అలాగే ఈ సినిమాలో నటించడం మంచి అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొంది. ఇక ఉద‌య‌నిధి స్టాలిన్ త‌న సహనటులకు ఎంతో గౌరవం ఇస్తారని, వ్యక్తిగతంగా ఆయనకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ షూటింగ్ లో ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తార‌ని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *