టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. ఈ నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఏన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో నాగశౌర్య వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు కానీ ఆ సినిమాల ద్వారా మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకోలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన లక్ష్య సినిమా డిజాస్టర్ పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణ వ్రిందా విహారి సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.

Hero Naga Shaurya Married Anusha Shetty in Bangalore - Sakshi
ఇకపోతే నాగశౌర్య ఇప్పటివరకు టాలెంటెడ్ బ్యాచిలర్స్ జాబితాలో కొనసాగాడు. ఇప్పుడు ఆ బ్యాచిలర్ నాగశౌర్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి ని వివాహమాడబోతున్నాడు. నాగశౌర్య వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవంబర్ 20 బెంగళూరులో మారియాట్ లో ఈ జంటకు వివాహం జరుగుతోంది.. నిన్న అనగా 19వ తేదీ ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది.

Hero Naga Shaurya Married Anusha Shetty in Bangalore - Sakshi

ఇక నాగశౌర్య చిత్రం కృష్ణ బృందా విహారి విజయాన్ని ఆస్వాదించే క్రమంలోనే పెళ్లి వార్తలు వినిపించాయి. నాగశౌర్య వివాహం చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్ అనూషా ను వివాహం చేసుకుంటున్నారని తెలిసి తన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ పెళ్లి తన స్నేహితుల సన్నిధిలో అలాగే కుటుంబ సభ్యుల సన్నిహితితో అలాగే ప్రముఖులతో విలాసవంతమైన వేడుకగా సాగుతోంది. అయితే ఈ వివాహం బెంగళూరులోనీ మారియట్ అనే ఫంక్షన్ హాల్ లో చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ అకేషన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అయితే నాగశౌర్య తన కాబోయే భార్య మెడలో తాళి కట్టి అలా నడిచి వచ్చి ఆప్తులతో, బంధుమిత్రులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. మొత్తానికి నాగశౌర్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు తన అభిమానులు ఈ విషయాన్ని తెలుసుకొని చాలా సంతోషంతో అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ కి ఇక గుడ్ బై చెప్పేసినట్టే అని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *