ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా ఎదగాలంటే నటన, టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలి. నటన రాకపోయినా నేర్చుకోవచ్చు కానీ అందం లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో ఎదగలేరు. చాలామంది హీరో హీరోయిన్లు వారి గ్లామర్ ని కాపాడుకోవడానికి ఎన్నో సర్జరీలు, వర్క్ అవుట్ లు చేస్తూ తమ బాడీని ఫిట్ గా మైంటైన్ చేస్తారు.ప్రస్తుతం అందం విషయంలో నాగార్జున గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జున ఇప్పుడంటే మన్మధుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ అప్పట్లో స్మార్ట్ గా కనిపించడం కోసం నానా తంటాలు పడ్డారట. ఎందుకంటే అప్పట్లో హీరో అవ్వాలంటే కచ్చితంగా ఫిట్ బాడీ, అందమైన మొహం ఉండాల్సిందే. ఎందుకంటే అప్పటి స్టార్ హీరోలు అందరూ మంచి ఫిజిక్ ని మెంటైన్ చేసేవారు.ఇక మొదట విక్రమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగార్జున. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే సన్నగా ఉండే నాగార్జునను డైరెక్టర్ రాఘవేంద్రరావు తీర్చిదిద్దారు. కేవలం హీరోయిన్లను మాత్రమే కాకుండా హీరో నాగార్జునను కూడా ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఒక శిల్పి లాగా చెక్కేశాడు.

రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్లో ఆఖరి పోరాటం అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కోసం రాఘవేందర్రావు కాస్త బొద్దుగా తయారవ్వు అంటూ నాగార్జునకు కండిషన్ పెట్టారట. కానీ నాగార్జున మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైం కి లావు కాలేకపోయారు. దాంతో ఎలాగైనా నాగార్జున ని లావుగా చూపించాలనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్ ప్యాంటు కి,షర్ట్ కి స్పాంజీలు వేసి మరీ బట్టలు కుట్టించారట. అయితే ఆ బట్టలు వేసుకోవడంలో నాగార్జున చాలా ఇబ్బంది పడి వేసుకోను అని చెప్పారట. కానీ డైరెక్టర్ మాత్రం కచ్చితంగా వేసుకోవాల్సిందే అని పట్టు పట్టడంతో నాగార్జున ఏం చేయలేకపోయారు.

ఇక ఆ బట్టలు వేసుకొని ఎండలో డాన్సులు చేస్తుంటే నాగార్జునకు చాలా ఇబ్బంది ఉండేదట. కానీ ఈ విషయంలో డైరెక్టర్ రాఘవేంద్ర కు ఎదురు చెప్పే ధైర్యం లేక ఆ బట్టలు వేసుకొని నటించక తప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో జానకి రాముడు అనే సినిమా కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో కూడా నాగార్జున కాస్త బొద్దుగా పల్లెటూరి కుర్రవాడిలా కనిపించడానికి ఆయన జుబ్బాల లోపల రెండించుల స్పాంజ్ వేసి కుట్టించారట. ఇలా ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో అందం కోసం నాగార్జున ఎన్నో ఇబ్బందులు పడ్డారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *