జమున తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అంతా కలిసి ఆమెను బ్యాన్ చేసినప్పటికీ..ఏమాత్రం తగ్గకుండా తన పొగరు చూపించి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సంచలనం సృష్టించింది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెను నమ్ముకొని సినిమాలు చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి హీరోలకు కూడా చుక్కలు చూపించింది జమున. జమున కర్ణాటకలోని హంపిలో బ్రాహ్మణుడు.. వ్యాపారవేత్త అయిన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి అనే వైశ్య దంపతులకు 1936 ఆగస్టు 30వ తేదీన జన్మించింది.

Veteran Actress Jamuna Is The First Heroine Of Hyderabad

అప్పుడు ఆమెకు జెన్ బాయ్ అని పేరు పెట్టారు. అయితే జమున మాతృభాష కన్నడ . కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న దుగ్గిరాలలో పెరిగింది. సావిత్రి దుగ్గిరాలలోనే ప్రదర్శన ఇచ్చినప్పుడు జమున ఇంట్లోనే ఉండేది. ఆ చదువుతోనే సావిత్రి, జమున మధ్య అక్కచెల్లెళ్ల చనువు, అనుబంధం ఏర్పడ్డాయి. ఆ తర్వాత సావిత్రి, జమునను సినిమాలలో నటించమని ఆహ్వానించింది. అలా సావిత్రి సలహా మేరకు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జమున. అయితే జమున స్కూల్లో స్టేజ్ పెర్ఫార్మర్ గా ఉండేది. ఆమె తల్లి జమునకు సంగీతం, హార్మోనియం కూడా నేర్పించింది.

Jamuna reveals the last days of Savithri garu - Telugu Bulletసావిత్రి సలహా మేరకు.. అమర్ కౌశిక్.. డాక్టర్ గారిపతి రాజారావు జమున స్టేజి షో మా భూమిని చూసి 1952లో ఆమెకు పుట్టిల్లు చిత్రంలో నటించడానికి ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె 14 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా సినిమాల్లోకి ప్రవేశించింది. అలా ఆమె నటించిన దొంగ రాముడు, మిస్సమ్మ, చిరంజీవిలు, ముద్దుబిడ్డ, భూకైలాస్, గుండమ్మ కథ, ఇల్లరికం, మూగమనసులు, రాముడు భీముడు, బొబ్బిలి యుద్ధం, మంగమ్మ శపథం, మట్టిలో మాణిక్యం, తోడునీడ, పండంటి కాపురం , పూలరంగడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

ఆ తర్వాత జమున ప్రొఫెసర్ జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. వీరికి వంశీ , స్రవంతి అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు .వంశీ మీడియా ప్రొఫెసర్గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు. స్రవంతికి పెళ్లయింది కూతురు, మనవడితో కలిసి ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటుంది జమున.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *