టాలీవుడ్ లో ఒకప్పటి కమెడియన్ అంటే బ్రహ్మానందం, బాబు మోహన్ ఇలా చాలామంది ఉండేవారు. అందులో ఒకరు గా పేరు సంపాదించిన కళ్ళు చిదంబరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన కామెడీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆయన మాట తీరు కూడా చాలా సపరేటుగా ఉంటుంది. ఈయన కళ్ళు అనే సినిమాతో మొట్టమొదటిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. అయితే ఈయనదాదాపు 300 సినిమాల్లో నటించారు. ఆయన్ని తెరమీద చూస్తే ప్రేక్షకులు సైతం నవ్వు ఆపుకోలేరు. అలాంటి కళ్ళు చిదంబరం ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అంతేకాకుండా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఒకవైపు ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన తీసిన కళ్ళు సినిమాతో ఆయన ఇంటిపేరు కూడా మారిపోయింది. ఈ విధంగా ఎంతో కష్టపడి ఆయన బాగానే సంపాదించారు.

Sridevi & Kallu Chidambaram Comedy Scen || Govinda Govinda Movie ||  Nagarjuna, Sridevi - YouTube

ఒకప్పుడు కళ్ళు చిదంబరం అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసే..అవార్డు అందుకున్నాడు. అలాంటి గొప్ప నటుడు ఈయన.అలాంటి చిదంబరం ఒకరోజు నాగార్జున, శ్రీదేవి నటించిన గోవిందా గోవిందా అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లు ఒక సీన్ లో కళ్ళు చిదంబరంతో శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ ఆమె భయపడిందో ఏమో నేను చేయలేను అతనితో అని చెప్పిందట. అప్పటికే ఆయన సెట్ పైకి వచ్చేసారట. దీంతో ఒక్కసారిగా ఇతనితో చేయను అని రాంగోపాల్ వర్మతో చెప్పిందట శ్రీదేవి. ఆయన ఆ మాటలు విని ఎవరనుకున్నావు ఆయన నంది అవార్డు అందుకున్న గొప్ప నటుడని తెలిపారు.ఆయన ఉంటేనే నేను ఈ సినిమా చేస్తాను లేదంటే ఇక్కడికి ఇక్కడే ఈ సినిమాను ఆపేసి వెళ్లిపోతాను అని తెగేసి చెప్పారట వర్మ.

ఈ విధంగా కోపగించుకోవడంతో సెట్లో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక శ్రీదేవి ఆయన గొప్పదనాన్ని తెలుసుకొని ఈ సినిమా చేయటానికి ఒప్పుకుందట. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే ప్రేక్షక ఆదరణ కూడా పొందారు. ఇక అప్పటినుంచి కళ్ళు చిదంబరం ఎక్కడ కనిపించిన కూడా శ్రీదేవి ఎంతో గౌరవంగా చూసేదట. ఈ విషయాలన్నీ కళ్ళు చిదంబరం గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *