గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 50 సంవత్సరాల పాటు తన గాత్రంతో సినీ రంగాన్ని శాసించిన ఈయన పాటంటే.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారనే చెబుతారు. ఆయన లేకుంటే సినీ ఇండస్ట్రీనే లేదు. ఆయన గాత్రంతో ఎందరో హీరోల స్టార్ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లారు బాలు గారు. 16 భాషల్లో తన గాత్రంతో 50 వేలకు పైగా పాటలు పాడిన ఏకైక తెలుగు గాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇక సంగీతంలో ఈయన సినీ ఇండస్ట్రీని ఏలేస్తే.. ఈయన కుటుంబం నుంచి వచ్చిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి అన్న కూడా హీరోగా సినీ రంగాన్ని శాసించారు.

ఏ హీరోయిన్ అయినా సరే ఈయన పక్కన నటిస్తే చాలు స్టార్ హీరోయిన్ అయిపోతారనే సెంటిమెంటు కూడా ఉంది.అంతేకాదు చాలామంది హీరోయిన్లు ఈయన పక్కన నటించాకే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్స్ కి లక్కీ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన అందరిని కడుపుబ్బా నవ్విస్తూ హీరోయిన్స్ కలల రాకుమారుడు గా ఒక వెలుగు వెలిగారు . ఇక ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసిన ప్రముఖ హీరో చంద్రమోహన్ . ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.

S P Balasubrahmanyam: A Tribute to the Great Singer - Rediff.com movies
1943 మే 23న కృష్ణా జిల్లా పామిడిముక్కల అనే ఊరిలో స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. చంద్రమోహన్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో రంగులరాట్నం సినిమా కోసం బి.యన్.రెడ్డి ఆడిషన్స్ పెట్టారు . చంద్రమోహన్ తన ఫోటోలు పంపించగా ఈ సినిమాలో అవకాశం లభించింది. ఆ తర్వాత ఈ సినిమా విజయం సాధించడమే కాదు ఆయనకు నేషనల్ అవార్డు కూడా అందించింది ఇక ఆ తర్వాత వినతిరిగి చూసుకోలేదు.

ఈ సినిమాతోనే అగ్రనటిగా వాణిశ్రీ , నటి విజయనిర్మల ఎంట్రీ ఇచ్చారు . చైల్డ్ ఆర్టిస్ట్ గా రేఖ కూడా ఈ మూవీ తోనే ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్.. బాలసుబ్రమణ్యం గారికి స్వయాన సోదరుడు వరుస అవుతారు. ఇలా వరుసకు ఇద్దరూ అన్నదమ్ములైనా ఎవరి రంగంలో వాళ్ళు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారే కానీ ఏ రోజు కూడా తమ రిలేషన్ బయట పెట్టలేదు. ఈ విషయం తెలిసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *