టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ కి.. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో నవంబర్ 15వ తేదీన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు శరీరం స్పందించకపోవడం వల్లే ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి.. కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15న తెల్లవారుజామున ఆయన మరణించినట్లు తెలిపారు. అయితే కృష్ణ మరణ వార్త వినగానే అభిమానులు హైదరాబాదు చేరుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనను కడసారి చూడడానికి తరలివచ్చారు.

Samantha Ruth Prabhu, Nagarjuna, Anushka Shetty and others mourn Superstar  Krishna's demise. See tweets - India Today
అందరూ వచ్చారు కానీ చివరిసారిగా చూడడానికి నాగార్జున రాకపోవడంతో పలు రకాల చర్చలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ క్లారిటీ ఇవ్వడం జరిగింది. భరద్వాజ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణకి మధ్య చక్కటి అనుబంధం ఉండేది.. అయితే దేవదాసు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా కూడా కృష్ణ మళ్ళీ వాటి పై మాట్లాడి పరిష్కరించుకున్నారు. ఇక నాగార్జునతో కూడా కృష్ణ పలు సినిమాలలో నటించారు. అయితే వారసుడు సినిమా సమయంలో అభిమానుల మధ్య గొడవలు జరిగినా అవి హీరోల మధ్యకు పోలేదంటూ కూడా భరద్వాజ వెల్లడించారు..

అయితే ఇందులో కృష్ణ గారి పాత్ర నిడివి తక్కువగా ఉందని అభిమానులు గొడవ పడడంతో కృష్ణ మీడియా ముందుకు వచ్చి అభిమానులకు సర్ది చెప్పారు. కానీ ఈ గొడవలో నాగార్జునకు , కృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి రాముడొచ్చాడు సినిమాలో నటించారు. అయితే కొన్ని బిజీ కారణాలవల్ల నాగార్జున కృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేదు . అంతే తప్ప వీరిద్దరి మధ్య ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు..

ఒకవేళ కృష్ణ ,నాగార్జున మధ్య విభేదాలు ఉంటే నాగార్జున తనయుడు నాగచైతన్య ఎందుకు కృష్ణ గారిని చూడడానికి వస్తాడు అంటూ కూడా ప్రశ్నించారు.. మొత్తానికైతే కృష్ణ – నాగార్జున మధ్య గొడవలు ఉన్నాయి అన్న విషయంపై భరద్వాజ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *