పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అంటే ఆయన తన నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటినుంచి ఈయన నటన అయినా సినిమాలు అయినా అభిమానులైనా చాలా భిన్నంగా ఉంటారు. ఇక ఈయన సినీ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఈయన మీద మూడు పెళ్లిళ్లు అనే విషయం తీసుకువస్తే చాలామంది విమర్శలు చేస్తారు. అయితే మొదట వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అద్దెపల్లి శ్రీధర్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మొదట చేసుకున్న నందిని అనే అమ్మాయి తో కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి మాత్రం పవన్ కళ్యాణ్ ని మా ఇంటికి ఇల్లరికంగా రా అని ఇబ్బంది పెట్టిందట. కానీ ఇల్లరికం వెళ్లడం పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం ఇష్టం లేక నేను రాను అని చెప్పాడు . ఇక ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం, ప్రేమ.

అందుకే కుటుంబానికి దూరంగా కన్న వాళ్ళను వదిలిపెట్టి వేరే వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్లడం నచ్చకే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి వేరే ఇంటికి ఇల్లరికం అల్లుడుగా వెళ్లాల్సిన అవసరం తనకు రాలేదని పవన్ కళ్యాణ్ భావించి 10 సంవత్సరాలు ఆమెకు దూరంగా ఉన్నాకూడా ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పెట్టకుండా విడాకులు ఇచ్చాడు అంటూ ఆ ఇంటర్వ్యూలో శ్రీధర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *