డైరెక్టర్ గీత కృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం సినిమాలు తీయకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్వ్యూలలో ఎందరో హీరో హీరోయిన్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, మరోవైపు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తూ నిత్యం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక ఈయన ఏ విషయం అయినా మొహం మీదే చెప్పేస్తే ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తాజాగా బాలకృష్ణ మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు గీతాకృష్ణ.

డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలకృష్ణ తాను హోస్టుగా చేస్తున్న షోలో వేరే పార్టీ నేతల గురించి గొప్పగా మాట్లాడితే ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అలాంటి మాటలు మాట్లాడారు కావచ్చు. అంతే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగడడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే బాలకృష్ణ కాల్పుల కేసుల్లో చిక్కుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణను కేసు నుండి తప్పించి ఆయనకు సహాయం చేశారు. అందువల్లే వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి బాలకృష్ణ పాజిటివ్ గా మాట్లాడారు.

అలాగే వైయస్సార్ కు కిరణ్ కుమార్ రెడ్డి,సురేష్ రెడ్డి ఇద్దరూ సన్నిహితులు కావడం వల్ల వారి ముందు ఆయన రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడారు. ఇక ఈ విషయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు బాలకృష్ణను ఆదరించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కి కూడా బాలకృష్ణ అంటే ఇష్టం. ఇక ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కేవలం తన పార్టీ వాళ్లతోనే కాకుండా అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో బాలకృష్ణ షోకు వెంకయ్య నాయుడు కూడా వస్తారు కావచ్చు.

అలాగే బాలకృష్ణ తన షోలో ఇలా అందరి గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తే తన పొలిటికల్ కెరియర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు. అంతేకాదు బాలకృష్ణ చేసే అన్ స్టాపబుల్ షో వల్ల ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉంది. సినిమాల్లో నటిస్తూనే ఇలా ఓ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ అందరి మెప్పు పొందుతూ తనలో ఉన్న మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ప్రజాదరణ పొందుతున్నారు అంటూ గీతాకృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం గీతాకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *