అక్కినేని వారి కోడలు, కింగ్ నాగార్జున సతీమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బెంగాల్ లో జన్మించిన అమల.. తమిళంలో ఘన విజయం సాధించిన `మైథిలీ ఎన్నై కథలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ తర్వాత అమలకు తెలుగు, తమిళ, మలయాళ భాషల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ త‌క్కువ స‌మ‌యంలోనే అమ‌ల సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది.

ఇటు నాగార్జున హీరోగా తెర‌కెక్కిన `చినబాబు` సినిమాతో అమల టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సమయంలో నాగార్జున అమల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. 1992లో నాగార్జున అమల వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ దంపతులకు 1994లో అఖిల్ జన్మించాడు. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న అమల.. భర్తకు అన్ని విధాలుగా నైతికబ‌లాన్ని అందిస్తూ ఆయన్ను ముందుకు న‌డిపించింది.

అలాగే పెద్దింటికి కోడలు అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా అమల అందరితోనూ ఎంతో వినయంగా నడుచుకునేది. సున్నిత మనస్తత్వం కలిగిన అమ‌ల‌.. వివాదాల‌కు ఎప్పుడు ఆమడ దూరంలో ఉండేది. అలాంటి ఆమె ఒకానొక సంద‌ర్భంగా బ్రాహ్మణుల ఆగ్రహానికి గురైంది. అసలేం జరిగిందంటే.. అమల తమిళంలో దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించింది. అందులో `వేదం పుదీతు(తెలుగులో వైదేహి)` అనే సినిమా కూడా ఒకటి. భారతీయ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, అమల జంటగా నటించారు.

ఇందులో నాస్తికుడి పాత్రను సత్యరాజ్‌ పోషిస్తే.. బ్రాహ్మణ స్త్రీ పాత్రను అమల చేసింది. అయితే బ్రాహ్మణ అమ్మాయిని నాస్తికుడైన హీరో ప్రేమించడం బ్రాహ్మ‌ణ సమాజం ఒప్పుకోదు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ సినిమా. అయితే ఈ సినిమా వివాదానికి దారి తీసింది. అమల, సత్యరాజ్ తో సహా దర్శకుడు భారతీయ రాజాపై తమిళ‌ బ్రాహ్మణులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనం రేపింది. అయితే చివరకు బ్రాహ్మణుల ఒత్తిళ్ల‌ వల్ల ఈ మూవీని బ్యాన్ చేశారు. మొత్తానికి వివాదాల‌కు దూరంగా ఉండే అమలకి ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *