పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ బ్యూటీ అనుష్క శెట్టి జోడీకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ జంటగా బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో నటించారు. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే ప్ర‌భాస్‌-అనుష్క‌ల ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఎంతలా అంటే సగటు ప్రేక్షకుడికి సైతం ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న భావన కలిగేంత. అభిమానులు కూడా వీరుద్ద‌రూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో తెగ ముచ్చట పడుతున్నారు. మ‌రోవైపు ప్రభాస్-అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎన్నో సార్లు మీడియా కోడై కూసింది.

కానీ, అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమే అని, పెళ్లి ఆలోచన తమకు లేదని ఖండించారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ప్రభాస్ అనుష్కల స్నేహాన్ని చూసి వారికి ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ప్రపోజల్ పెట్టారట. కృష్ణంరాజు కూడా వీరిద్ద‌రికి పెళ్లి చేయాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించార‌ట‌. కానీ ప్రభాస్ అనుష్కతో పెళ్లికి నో చెప్పాడట.

అనుష్కకు కాస్త ఈగో ఎక్కువట‌. ప్రతి విషయంలోనూ తాను చెప్పేదే కరెక్ట్ అని భావిస్తుందట. ఇంచుమించుగా ప్రభాస్ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుందట. ఇద్దరి స్టేట్ ఆఫ్ మైండ్స్ ఒకేలా ఉంటే రిలేష‌న్ షిప్‌ ఎక్కువ కాలం ఉండదని భావించే ప్రభాస్ వెన‌క్కి త‌గ్గాడ‌ని టాక్ నడుస్తోంది. ఇక ఇరు కుటుంబ సభ్యుల సైతం పెళ్లి విషయంలో ప్రభాస్‌-అనుష్క‌ లోను ఒత్తిడి చేయలేదని టాక్. మరి నాలుగు పదుల వయసు దాటిన వీరిద్ద‌రూ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *