సాధారణంగా హీరోయిన్ అంటేనే సినిమా సెట్ లో వారికి చాలా గౌరవం ఉంటుంది. అలాగే ఇస్తారు కూడా.. అయితే వారికి మాత్రమే కాకుండా హీరోయిన్ తల్లి అలాగే హీరోయిన్ తో ఎవరు వస్తే వాళ్ళకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇదే విషయాన్ని చాలామంది సినిమాలలో చాలా వ్యంగంగా చూపిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ల ప్రాధాన్యత బాగా పెరిగిపోవడంతో వాళ్లతో పాటు వచ్చిన వాళ్లను సరి సమానంగా చూసుకుంటున్నారు. అంతేకాదు హీరోలతో సమానంగా హీరోయిన్లను కూడా ట్రీట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

మర్యాద విషయంలో హీరోలతో సమానంగా ఇస్తున్నారు కానీ పారితోషకం విషయంలో హీరోలతో సమానంగా ఇవ్వడం లేదు. ఒక్కొక్క హీరోయిన్ తన పర్సనల్ అసిస్టెంట్లు, హెయిర్ డ్రెస్సర్, మేకప్ అసిస్టెంట్, మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా రకరకాల పేర్లతో సుమారుగా 12 నుంచి 15 మందిని తమతో తీసుకొస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక హీరోయిన్ టాలీవుడ్ లో ఒక సినిమా యూనిట్ కి చుక్కలు చూపించిందని సమాచారం. ఈ మధ్యనే కొన్ని కారణాలతో షూటింగ్ లు ఆగిపోయి.. ఇప్పుడే మొదలుపెట్టి అంతా బాగానే నడుస్తుందని భావిస్తున్న దర్శక నిర్మాతలకు ఈమె ప్రవర్తన ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ లో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ ఉదయాన్నే 6:00 కి అంతా సెట్ లో ఉండాలి. విత్ మేకప్ తో.. సూర్యోదయం షాట్ ఆమె మీద తీయాలని దర్శకుడు భావించారు. అయితే సదరు హీరోయిన్ 20 నిమిషాలు లేటుగా సినిమా సెట్ కి వచ్చిందట. కానీ అప్పటికే సూర్యోదయం జరిగి పోవడంతో ఆరోజు ఆ షాట్ తీయలేదనే బాధతో సదరు హీరోయిన్ అసిస్టెంట్ మీద దర్శకుడు కోప్పడ్డాడు. అంతే కాదు తన బాధ చెప్పుకొని ఇప్పుడు మీకోసం ఒక రోజంతా వేస్ట్ చేయాలి అన్నట్లుగా మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని సదరు అసిస్టెంట్ తీసుకెళ్లి హీరోయిన్ వద్ద చెప్పడంతో ఈ విషయాన్ని తనకు జరిగిన అవమానంగా భావించిన హీరోయిన్ దర్శకనిర్మాతలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది.

వెంటనే వెళ్లి ఆమె తనకు కేటాయించిన క్యారవాన్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుందట. తలనొప్పిగా ఉందని కారణం చెప్పే సుమారుగా నాలుగు గంటల పాటు హీరోయిన్ అదే కేరవాన్ లోపలి ఉండిపోయింది. ఇలా ఆమె కారణంగా సినిమా షూటింగ్లో ఒకరోజు మొత్తం వృధా అయ్యింది. విషయం తెలుసుకున్న నిర్మాత దర్శకుడు సినిమా యూనిట్ మొత్తం ఆమెకు సారీ చెప్పారట అంతేకాదు ఆమెను బయటికి రావాలని అడుక్కోవడంతో ఆమె ఇగో సాటిస్ఫై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *