సినిమా ఇండస్ట్రీ అన్నాక ఎవరో ఒకరి గురించి ఎప్పుడో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ హీరో ఈ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఈ డైరెక్టర్ ఆ హీరోయిన్ ని ట్రాప్ చేస్తున్నాడని, ఆ నిర్మాత వలలో ఈ హీరోయిన్ పడిందని, ఆ హీరో తన భార్యకు దూరంగా ఉంటున్నాడని, ఈ హీరోయిన్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ ఇలా ఏదో ఒక రూమర్ ప్రతి ఒక్క హీరో హీరోయిన్ల మీద వస్తూనే ఉంటుంది. చాలామంది స్టార్ హీరోల మీద ఇప్పటికే ఎన్నో వార్తలు రావడం మనం చూసాం. కానీ మెగాస్టార్ చిరంజీవి మీద ఇలాంటి రూమర్స్ రావడం చాలా తక్కువ.

ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి గొడవలకు పోకుండా సురేఖ చిరంజీవి ఇద్దరు చాలా అన్యోన్యంగా తమ దాంపత్య జీవితంలో ముందుకు పోతున్నారు. చిరంజీవి మొదటి నుండి కూడా సురేఖ విషయంలో చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఏవైనా ఈవెంట్లు, కార్యక్రమాలలో కూడా సురేఖ గొప్పతనం, మంచితనం గురించి ప్రతిసారి చెబుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు నేను మెగాస్టార్ రేంజ్ లో ఉండడానికి కారణం మా మామ గారు అల్లూ రామలింగయ్య ఒక రీసన్ అయితే నా భార్య సురేఖ కూడా రెండో రీసన్ అంటూ చెప్పుకు రావడం ఇప్పటికే ఎన్నోసార్లు విన్నాం.

అయితే ఇలా ఎంతో గొప్పగా చెప్పుకునే భార్య సురేఖ మీద చిరంజీవి ఒకానొక టైంలో కోపం తెచ్చుకున్నారట. మరి అలా కోప్పడ్డానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి సురేఖ పెళ్ళయ్యాక కొన్ని రోజులకు ఎక్కడికైనా బయటికి వెళ్దామని ఒక టూర్ ప్లాన్ చేసుకున్నారట. అయితే అప్పటికే చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక సినిమా షూటింగ్ వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకున్న రోజే మళ్లీ రీ స్టార్ట్ అయిందట. అయితే ఈ విషయం చిరంజీవి సురేఖకు చెప్పలేదు. ఇక ఎంత టైం అవుతున్నా చిరంజీవి ఇంటికి రాకపోవడంతో సురేఖ ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది.

ఇలా ఎన్నిసార్లు చేసినా చిరంజీవి లిఫ్ట్ చేయకపోవడంతో చిరంజీవికి ఏమైందో ఏమో అనే భయంతో మళ్ళీ మళ్లీ సురేఖ చిరంజీవికి ఫోన్లు చేసిందట. ఇక సురేఖ చేసే ఫోన్లకు విసిగిపోయిన చిరంజీవి ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఫోన్ ఎత్తకపోతే బిజీగా ఉన్నానని నీకు అర్థం కాదా అంటూ కోపంగా మాట్లాడారట. ఇక ఎన్నడూ లేనిది చిరంజీవి ఆమెపై అంత కోపంగా మాట్లాడడంతో సురేఖ చాలా బాధపడిందట. కానీ ఆ తర్వాత విషయం చెప్పి సురేఖను చిరంజీవి కూల్ చేశారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *