ప్రముఖ స్టార్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవ‌ల `యశోద` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించింది.

మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కారణంగా యశోద ప్రమోషన్స్ లో సమంత పాల్గొనలేకపోయినా.. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి ఆమె ఖాతాలో సూపర్ హిట్‌ పడేలా చేశారు. ఈ మూవీ తో సమంత క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహా స‌మంత‌తో ఓ టాక్ షో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఇప్పటికే ఆహాలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన‌ `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సూపర్ సక్సెస్ అయింది. ఇటీవ‌ల సీజ‌న్ 2 సైతం ప్రారంభ‌మైంది. అయితే అన్‌స్టాపబుల్ తో పాటు సమంత చేత మరో టాక్ షో చేసేందుకు ఆహా టీం సిద్ధమవుతుందని జోరుగా టాక్‌ నడుస్తోంది. ఈ టాక్ షోలో కేవలం లేడీస్ మాత్రమే గెస్ట్ లుగా రానున్నారట.

ఇప్పటికే స‌మంత‌తో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఈ షోకు సంబంధించి అన్ని వివరాలు అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే సమంత ఆల్రెడీ ఆహా వేదికగా `సామ్‌-జామ్‌` అనే టాక్ చేసింది. ఈ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ నేప‌థ్యంలోనే ఒకసారి దెబ్బ తిన్న తర్వాత కూడా మళ్లీ టాక్ షో చేసి బాలయ్యతో పోటీ పడటం అవసరమా సామ్‌ అంటూ నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. మ‌రి ఈ టాక్ షో విష‌యంలో స‌మంత డేరింగ్ గా ముందుకు వెళ్తుందా..? లేదా వెన‌క‌డుగు వేస్తుందా..? అన్న‌ది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *