ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ గా మారిపోయాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో జంటలు వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఒకరు. ఈమె కొద్ది రోజుల క్రితం తన భర్త, ప్రముఖ స్టార్ హీరో ధనుష్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మ‌ళ్లీ క‌ల‌వ‌బోతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. రజినీకాంత్ కూడా తన భార్య లతకు విడాకులు ఇచ్చే దిశ‌గా అడుగు వేశార‌ట‌. అవును, మీరు విన్నది నిజమే. పైగా రజినీకాంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు. చాలా ఏళ్ల కిందటది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినీ పరిశ్రమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న రజినీకాంత్ 1981లో లతను ప్రేమ వివాహం చేసుకున్నారు. 1980లో లత తన కాలేజీ మ్యాగజైన్ కోసం రజీనీకాంత్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ సమయంలోనే రజినీకాంత్ లతతో ప్రేమలో పడ్డారు. పెద్దలు కూడా అంగీకరించడంతో వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అని ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో రజినీకాంత్-లతల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సహజంగానే మహా భక్తుడైన రజినీకాంత్ అప్పట్లో హరే కృష్ణ మూమెంట్లో చేరి భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేశారట. దాంతో అన్యోన్యంగా సాగుతున్న రజినీకాంత్-లత కాపురంలో కళతలు చోటు చేసుకున్నాయి. తమిళ మీడియా సైతం భార్య లతతో రజనీకాంత్ కు పడడం లేదని, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కోడై కోసింది.

ఇదే మాట రజినీకాంత్‌ను అడగ‌గా.. కొన్ని అభిప్రాయ బేధాల వల్ల తాను, త‌న భార్య లత వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామ‌ని, అంతకుమించి త‌మ‌ మధ్య ఎలాంటి ద్వేష భావన లేద‌ని ఓపెన్ గానే కామెంట్స్‌ చేసి సంచలనం రేపారు. దీంతో రజినీకాంత్-ల‌త‌ విడిపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ కొంత కాలానికి తమ మధ్య ఏర్పడిన మనస్ప‌ర్థ‌ల‌ను తొలగించుకుని ర‌జినీకాంత్-లత మళ్లీ ఒకటయ్యారు. ఎన్ని విభేదాలు వచ్చినా వాటిని ఎదురించి ఒకటిగా నిలిచిన ఈ జంట.. ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *