టాలీవుడ్లోకి యంగ్ హీరోయిన్ నిత్యా మీనన్ మొదట అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా నిత్యమీనన్ తన ప్రెగ్నెన్సీ ఫొటోస్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో ఈ పిక్స్ క్షణాలలో వైరల్ గా మారాయి. గతంలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారని ఆ రిజల్ట్ పాజిటివ్గా వచ్చిందని తెలుపుతూ ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది నిత్యమీనన్.

Nithya Menon Shares Baby Bump Photos Goes Viral From Behind the Scene -  Sakshi

అయితే ఈసారి ఏకంగా ఒక బేబీ బంప్ ఫోటో ని షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు నిత్యామీనన్ కి వివాహం కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యిందా అంటూ పలు అనుమానాలను రేకెత్తించేలా చేస్తోంది. దీనిపై గడచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో అసలు విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది నిత్యామీనన్. సోషల్ మీడియాలో అంతంత మాత్రమే యాక్టివ్ గా ఉండే నిత్యా మీనన్ గత నెల 28వ తేదీన ఒక పోస్టులో టెస్టింగ్ కిట్ తో పాటు బేబీ పాలపీకను చూపించిన ఈమె ఇప్పుడు ఒకేసారి బేబీ బంప్ చూపిస్తూ ఇది నిజం కాదని కేవలం సినిమా కోసమే అన్నట్లుగా తెలియజేసింది.

ప్రస్తుతం నిత్యామీనన్ నటిస్తున్న వండర్ వుమెన్ అని.. మలయాళ చిత్రంలో ఆరుగురు గర్భిణీ స్త్రీల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. స్త్రీలు ప్రీ నేటల్ ట్యూటర్ మార్గదర్శకత్వంలో మాతృత్వాన్ని పొందుతారు . ఇందులోని నోరా అనే గర్భిణీగా నిత్యామీనన్ నటించిన ఇదే విషయాన్ని ఆమె చెపుతూ తన ప్రెగ్నెన్సీ డిస్కషన్ కి పోలీస్ స్టాప్ పెట్టింది నిత్యామీనన్. ఇకపోతే ఈ సినిమాలో ఆమె నటించడం తనకు చాలా మంచి ఫీలింగ్ అని కూడా తెలిపింది. మొత్తానికైతే ఇది సినిమా ప్రమోషన్ లో టెక్నిక్ అని తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

నిజానికి ఈమధ్య చాలామంది హీరోయిన్లు చాలా డేర్ స్టెప్ తీసుకుంటున్నారనే చెప్పాలి. వివాహానికి ముందే ప్రెగ్నెన్సీ అనుభూతిని వీరు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని నయనతార, నిత్యామీనన్, సమంత ఇలా ఎంతోమంది వివాహానికి ముందే గర్భవతి అన్న అనుభూతిని పొందడం ఒకరకంగా వీరు చేసిన సాహసమే అని చెప్పాలి. మరి నిత్యమీనన్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.

https://www.instagram.com/p/ClGZ5F6hFic/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *