కృష్ణ మరణించిన నాటి నుండి ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆయన రెండు పెళ్లిళ్ల గురించి, ఆస్తిపాస్తుల గురించి,కొడుకులు కూతుర్ల పెళ్లిళ్ల గురించి, అంత్యక్రియల గురించి ఇలా ప్రతి విషయం మీద ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా కృష్ణ గారికి సంబంధించిన మరొక విషయం ఇప్పుడు తెరమీదకు వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అదేంటంటే.. కృష్ణ తన రెండో భార్య చనిపోయినా కూడా నరేష్ కుటుంబంతోనే ఉండడం. ఎందుకంటే అతను కృష్ణ సొంత కొడుకు కాదు విజయనిర్మల కొడుకు.

ఈ విషయంలో రెండో భార్య చనిపోతే ఎవరైనా కన్న కొడుకు దగ్గర ఉంటారు కానీ కృష్ణ మాత్రం దానికి భిన్నంగా నరేష్ దగ్గర ఉన్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కృష్ణ బతికున్నప్పుడు గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆయన మీ రెండో భార్య చనిపోయిన నరేష్ దగ్గరే ఎందుకు ఉంటున్నారు అని అడగ్గా.. దానికి కృష్ణ మాట్లాడుతూ.. నాకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో నరేష్ కూడా అంతే ఇష్టం. అతను నా కన్న కొడుకు కాకపోయినా నరేష్ మీద నాకు ఎందుకు అంత ఇష్టం అంటే నాకు ఎలాంటి అవసరం వచ్చినా సెకన్ లో నా ముందు వచ్చి నా అవసరాన్ని తీరుస్తాడు.

అంతేకాదు నరేష్ షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఎప్పుడూ నేను అడిగిన అవసరాల గురించే ఆలోచిస్తాడు. ఏదైనా కావాలని ఫోన్ చేయగానే వెంటనే నా దగ్గరికి వస్తాడు. అయితే ఈ విషయంలో మహేష్ బాబు నా విషయాలు పట్టించుకోవడం లేదు అని చెప్పడం లేదు.కానీ మహేష్ బాబు పెద్ద స్టార్ హీరోఅయ్యాడు. అతను సినిమాల్లో చాలా బిజీగా ఉంటాడు. అలాగే మహేష్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ నమ్రతనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇక ఈ విషయంలో నేను కూడా ఆమె మీద ఆధారపడి నమ్రతకు భారంగా మారాలని అనుకోలేదు.అందుకే నేను విజయనిర్మల చనిపోయినా కూడా నరేష్ తోనే ఉంటున్నాను. నా భార్య విజయం నిర్మల చనిపోయిన కూడా నరేష్ నన్ను కన్నతండ్రిలా చూసుకున్నాడు అంటూ కృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక నటుడు నరేష్ విషయానికి వస్తే.. విజయనిర్మల కొడుకు అయినప్పటికీ తన తల్లి పేరును స్టెప్ ఫాదర్ పేరును తన పేరులో జోడించుకొని నరేష్ విజయ కృష్ణ అంటూ మార్చుకున్నాడు. అయితే చాలామంది కృష్ణ కి మహేష్ బాబే ఇష్టం అనుకుంటారు. మహేష్ బాబు ఇష్టమే కానీ విజయనిర్మల చనిపోయాక ఆమె ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపించిందో అంత ప్రేమ ఆమె చనిపోయాక నరేష్ కృష్ణ మీద చూపించి అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకున్నాడట. దీంతో కృష్ణకు నరేష్ మీద కూడా ప్రేమ,గౌరవం పెరిగింది. అందుకే కృష్ణ నరేష్ కుటుంబంతోనే ఉన్నాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *