ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు తమ వ్యక్తిగత విషయాల వల్ల సినిమా నుండి బ్యాన్ అవుతూ వస్తున్నారు. దానివల్ల సినిమాలలో వీరికి అవకాశాలు కూడా రావడం లేదు. ఎందుకంటే తాము తమ వ్యక్తిగత విషయాల పట్ల ప్రవర్తించే తీరు అలా ఉంటుంది మరీ. ఇప్పటికే చాలామంది నటీనటులు దర్శకనిర్మాతలతో స్టార్ నటీనటులతో విరుద్ధంగా ప్రవర్తించి సినిమా నుండి బ్యాన్ చేయబడ్డారు.

Actress Sneha @ Sivakarthikeyan - Nayanthara Movie | New Movie Posters

గతంలో కూడా స్నేహ , నయనతారకు ఇలాంటి సంఘటన ఎదురైందని చెప్పాలి. అది కూడా బాలకృష్ణ వల్ల ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యకరం. అసలు విషయంలోకి వెళ్తే సినీ ఇండస్ట్రీలో నయనతార, స్నేహ స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నయనతార కంటే ముందే స్నేహ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది . ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు కూడా సంపాదించుకొని హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ అంటే చాలామందికి మంచి గౌరవం కూడా. చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ అడపాదడప సహాయ పాత్రలలో నటిస్తూ వస్తోంది.

అప్పట్లో హీరోయిన్ స్నేహకు, నయనతారకు బాలయ్య నోటీసులు పంపారని మీకు తెలుసామరొకవైపు నయనతార కూడా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని తమిళ్, తెలుగు స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.ఇదిలా ఉండగా గతంలో వీరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నోటీసులు పంపించడం మరొక సంచలనానికి దారితీసింది. గతంలో వరద బాధితుల సహాయార్థం కోసం బాలకృష్ణ ఈవెంట్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. అది కూడా స్టార్ నైట్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. అయితే స్పందన అనే ఈ స్టార్ నైట్ కార్యక్రమానికి హాజరుకావాలని ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఇతర ప్రముఖులకు అందరికీ కూడా నోటీసులు పంపించాడు. అయితే ఈ నోటీసులు పంపే ముందు ప్రతి ఒక్కరిని ఈ విషయం గురించి సరైన వివరణ ఇవ్వాలి అని తెలిపాడు. ఒకవేళ ఎటువంటి వివరణ ఇవ్వకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ అవుతారని కూడా డిమాండ్ చేశారు.

అయినా కూడా ఈ కార్యక్రమానికి అటు స్నేహ , ఇటు నయనతార ఇద్దరూ కూడా హాజరు కాలేదు. త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ ఆమె ముందే హాజరుకానని తెలిపిందట. కానీ స్నేహ , నయనతార క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆరోజు జరిగిన సమావేశంలో ఈవెంట్ హానరరీ చైర్మన్ డాక్టర్ దాసరి నారాయణరావు ఎవరైతే ఈవెంట్ కి దూరంగా ఉంటారో వాళ్ళపై నిషేధం జరుగుతుందని స్పష్టం చేశాడు. దీంతో నయనతార, స్నేహాలపై కూడా అప్పట్లో నిషేధం జరిగిందని వార్తలు వినిపించాయి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరిపై నిషేధాన్ని రద్దు చేశారని.. మరొకసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *