ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన విషాదకరమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే కృష్ణంరాజు, కృష్ణ భార్య ఇందిరాదేవి అలాగే కృష్ణ మరణం తో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. వరుసగా స్టార్ సెలబ్రిటీలు చనిపోవడంతో కుటుంబ సభ్యుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవి, కృష్ణ ఇద్దరు చనిపోవడంతో మహేష్ బాబు ఒంటరివాడయ్యాడు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఘట్టమనేని ఇంట్లో వరుసగా మూడు వారాలు చోటు చేసుకున్నాయి.

ఇక మహేష్ బాబు జీవితంలో కీలకమైన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆయన పుట్టెడు దుఃఖం లో మునిగిపోయారు. ఇక కృష్ణ ఇందిరా దేవి చనిపోయాక వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చూద్దాం. ఇందిరా దేవి తన భర్త కృష్ణ దగ్గర మహేష్ బాబు విషయంలో ఒక ఒట్టు వేయించుకుందట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ తన వారసులుగా రమేష్ బాబు మహేష్ బాబుని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనే ఆలోచనలో పడ్డారట. అయితే ఈ విషయంలో తన భార్య ఇందిరా దేవితో కృష్ణ మాట్లాడారట.

మన ఇద్దరి కొడుకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం. వాళ్ళు పెద్ద స్టార్ హీరోలు అవుతారు అని కృష్ణ చెప్పుకొచ్చారట. ఇక కృష్ణ చెప్పిన మాటలను విన్న ఇందిరా దేవి ఒప్పుకుంటూనే మీరు నాకు ఓ మాట ఇవ్వండి అని చెప్పి ఒట్టు కూడా వేయించుకుందట.అదేంటంటే.. మీరు పెద్ద స్టార్ హీరో అయి ఇండస్ట్రీని ఏలుతున్నారు.అది సంతోషకరమైన విషయమే. కానీ ఒకవేళ మీరు హీరో కాకపోతే మీ పరిస్థితి మరోలా ఉండేది. అయితే మీరు స్టార్ హీరో అయ్యారు కాబట్టి మీ పిల్లలు అదే రేంజ్ లో స్టార్ డం తెచ్చుకోవాలనే గ్యారెంటీ లేదు. అందుకే మహేష్ బాబు బాల నటుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముందు మహేష్ బాగా చదువుకోవాలి.

మహేష్ ముందుగా ఓ డిగ్రీ పట్టా సాధిస్తే నే సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి. లేకపోతే సినిమాల్లోకి వద్దు అని కృష్ణతో చెప్పి ఒట్టు వేయించుకుందట. అంతేకాదు రమేష్ బాబు విషయంలోనూ ఇదే మాట తీసుకుందట.ఇక ఈ విషయంలో కృష్ణ కూడా ఓకే చెప్పారట. అయితే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ముందే ఎంట్రీ ఇచ్చారు. ఇక తల్లి మాట ప్రకారం చదువు కూడా పూర్తి చేశారు.ఇలా ఇందిరా దేవి తన కొడుకుల విషయంలో కృష్ణ తో ఒట్టు వేయించుకుందట. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ ఇందిరా దేవి కొడుకుల విషయంలో ఇంత జాగ్రత్త తీసుకుందా అంటూ మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *