సూపర్ స్టార్ కృష్ణ మరణించి నాలుగు రోజులవుతున్నా కూడా ఆయన గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇక కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీలో లెజెండ్స్ శకం ముగిసింది అంటూ చాలామంది సినీ ప్రముఖులు బాధపడ్డారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే..కృష్ణ ముందుగా తన మేన మరదలైన ఇందిరా దేవిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే విజయ నిర్మలతో ప్రేమలో పడి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.కృష్ణ కి మొదటి భార్య ఇందిరా దేవికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.

అయితే కృష్ణ ఎప్పటి నుండో తన ముగ్గురు కూతుర్లకు మంచి సంబంధాలు తీసుకురావాలని ఆలోచించేవారట. అలాగే తన పెద్ద కూతురును మంచి ఉన్నతమైన కోటేశ్వరుల ఇంటికి కోడలుగా పంపించారు. ఇక రెండవ కూతురు మంజుల లవ్ విషయంలో చాలా రోజులు ఆమెను ఇబ్బంది పెట్టారు. మంజుల సంజయ్ ని ఎప్పటినుండో ప్రేమించిందట. కానీ కృష్ణ ఒప్పుకోవడం లేదని అలాగే ఉండిపోయింది. అయితే మంజుల ప్రేమను అర్థం చేసుకున్న ఇందిరా దేవి కష్టమైనా సుఖమైన కూతురే అనుభవిస్తుంది కదా ఆమె ఆలోచనలను మనం గౌరవిద్దాం అని కూతురికి ఇష్టమైన సంజయ్ తోనే పెళ్లి జరిపించారట. అందుకే మంజుల పెళ్లి చాలా ఆలస్యంగా జరిగింది.

అయితే మంజుల ప్రేమ వివాహం కృష్ణకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే పెద్ద కూతురు లాగే మంజుల ను కూడా మంచి కోటీశ్వరులైన ఇంటికి కోడలుగా పంపిద్దాం అనుకున్నారట. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది ఇంకొకటి అయింది. ఇక మంజుల విషయంలోనే అలా జరిగింది.మూడో కూతురు ప్రియదర్శిని నైనా పెద్ద కూతురి లా మంచి కుటుంబంలోకి ఇద్దాం అనుకున్నారట. కానీ ప్రియదర్శిని కూడా హీరో సుధీర్ బాబుని ప్రేమించింది. ఇక ఈ విషయంలో ముందు కృష్ణ కాస్త మొండికేసిన ఆ తర్వాత వీరి ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారట. అయితే ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబుకు కూడా ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ తన ముగ్గురు కూతుర్లలో కేవలం పెద్దకూతురు విషయంలోనే కృష్ణ నిర్ణయం ప్రకారం పెళ్లి జరిగింది.

ఇక ఇద్దరు కూతుర్లు వారికి నచ్చిన అబ్బాయిలనే పెళ్లి చేసుకున్నారు. అయితే చిన్న కూతురు ని సుధీర్ కి ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కృష్ణ చాలా ఆలోచించారట. పెద్ద కూతురుని గొప్పింటికి ఇచ్చాను. రెండో కూతురు విషయంలో నా నిర్ణయం పనిచేయలేదు.ఇక మూడో కూతురు విషయంలోనైనా మంచి సంబంధం చూసి గొప్పింటికి ఇద్దామని అనుకున్నారట. కానీ ప్రియదర్శని సుధీర్ ని లవ్ చేయడంతో కృష్ణ వారి పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. అయితే చిన్న కూతురు విషయంలో మాత్రం కృష్ణ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సుదీర్ బాబుని కృష్ణ ఇల్లరికం అల్లుడుగా తెచ్చుకున్నారు. ఎందుకంటే తాను వృధాప్యంలోకి వచ్చాక దగ్గరుండి అన్ని చూసుకుంటాడు అనే ఉద్దేశంతో చిన్న కూతురుని, చిన్నల్లుడుని ఇల్లరికం చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *