ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఈ మధ్యనే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందించింది. అలాగే యశోద సినిమాకు మొదటి రోజే భారీ కరెక్షన్లు రావడంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్ళింది. అయితే సమంత మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడినందున యశోద ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేదు. కేవలం కొన్ని ప్రమోషన్స్లో మాత్రమే సమంత పాల్గొంది. ఇక అలా సమంత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె చేతికి ధరించిన ఉంగరాల గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఆమె విషయంలో ప్రతి ఒక్కటి గమనించే నెటిజెన్లు తాజాగా వారి చూపు ప్రస్తుతం ఆమె వేళ్ళకు ధరించిన ఉంగరాలపై పడింది.అయితే సమంత అతని కోసమే ఆ ఉంగరాలను పెట్టుకుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సమంత ఏ ఈవెంట్ అయినా కూడా డిజైనర్ జువెల్లర్స్ తో కనిపించేది. కానీ ఫస్ట్ టైం యశోద ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు చాలా సింపుల్ గా కనిపించింది. అంతేకాకుండా తన చేతికి మూడు ఉంగరాలను కూడా పెట్టుకోవడంతో ఆమె ఉంగరాలపై అందరి దృష్టిపడి ప్రస్తుతం ఆ ఉంగరాల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్యకాలంలో సమంత చుట్టూ జరుగుతున్న పరిణామాల వల్ల ఆమె ఎక్కువగా జాతకాలు నమ్ముతుందట.

ఇక ఆ జాతకాలను నమ్మడం వల్ల తన చేతికి ఆ ఉంగరాన్ని ధరించింది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఉంగరాలను సమంత కేవలం నాగచైతన్య కోసం మాత్రమే పెట్టుకుంది అంటూ నెట్టింట్లో ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది. సమంత నాగచైతన్య తో పెళ్లి కాకముందు అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం దోష నివారణ పూజల పేరుతో శ్రీకాళహస్తిలో పూజలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం సమంత ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది కాబట్టి గుడికి వెళ్లే పరిస్థితి లేకపోయినందువల్ల ఆమె జాతకాలను నమ్మి ఆ ఉంగరాలు ధరించిందని సమాచారం. ఇక సమంత తన చేతికి పెట్టుకున్న మూడు ఉంగరాల్లో ఒకటి గోమేధకం. ఈ ఉంగరం చెడు దృష్టిని పోగొట్టి,శారీరకంగా మానసికంగా మంచి ఫలితాలను ఇస్తుందట. అలాగే మరో ఉంగరం పేరు ముత్యం.

ఈ ఉంగరం ఒక్క క్షణంలో చంద్రుడు బలహీనంగా మారినప్పుడు దాని ప్రభావం మన హెల్త్ పై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందట. ఇక మూడో ఉంగరం కనకపుష్యరాగం.. ఈ ఉంగరాన్ని ఆరోగ్యానికి, సంపదకు శుభ సూచకంగా పెట్టుకుంటారట. ఇక ప్రస్తుతం సమంత ఈ మూడు ఉంగరాలను నాగచైతన్యను మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసమే ధరించింది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది దీనిని వ్యతిరేకిస్తే మరి కొంతమందేమో ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఒక్క ఉంగరాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆ మూడు ఉంగరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఖచ్చితంగా ఇది నాగచైతన్య మీద ఇష్టంతోనే పెట్టుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *