టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్ తీస్తే అల్లు అర్జున్-స్నేహా రెడ్డి జంట ఖ‌చ్చితంగా ఉంటుంది. వరంగల్ కు చెందిన స్నేహా రెడ్డి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌కు వచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో బన్నీ-స్నేహా తొలి సారి క‌లుసుకున్నారు. స్నేహా రెడ్డిని చూసిన తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు బన్నీ. భిన్న నేపధ్యాలు కలిగిన ఈ జంట ప్రేమను మొదట ఇరు కుటుంబ‌సభ్యులు అంగీకరించకపోయినా.. ఫైనల్ గా అందర్నీ ఒప్పించి 2011 మార్చ్ 6న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు జన్మించింది. ఇటీవలే బన్నీ- స్నేహా రెడ్డిలు భార్యాభర్తలుగా దశాబ్దం పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్ల జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలిచిన ఈ జంట గురించి తాజాగా ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే స్నేహ రెడ్డితో బన్నీకి విభేదాలు ఏర్పడ్డాయట.

వీరి దాంపత్య జీవితం చిక్కుల్లో పడిందంటూ సోషల్ మీడియాను ఓ న్యూస్ ఊపేస్తోంది. ఇటీవల స్నేహా రెడ్డి బిహేవియర్ లో చాలా మార్పు వచ్చిందట. సినిమాల్లో నటించకపోయిన సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ స్నేహారెడ్డి.. గ‌త కొద్ది రోజుల నుంచి హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. సినిమాల్లోకి రావాలనే ఇలా గ్లామ‌ర్ షో చేస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఏమైందో ఏమోగానీ.. స్నేహా భర్తను ఎవైడ్ చేయడం కూడా మొదలుపెట్టిందట. బన్నీ ఎంత ప్రేమ‌గా ఉన్నా సరే.. ఆమె ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. రీసెంట్‌గా ఓ ఫ్రెండ్ పెళ్లి కోసం ఈ జంట సౌత్ ఆఫ్రికా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ తన ఫ్రెండ్స్ ముందు భర్తను స్నేహా ఘోరంగా అవమానించిందట. దీంతో సౌత్ ఆఫ్రికా నుంచి వస్తూ వస్తూనే బన్నీ స్నేహాలు గొడ‌వ‌పడుతూ వచ్చారట. హైదరాబాద్ వచ్చిన త‌ర్వాత‌ కూడా వీరిద్దరి మధ్య మాట‌లు లేవని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *