ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ కొత్త కెప్టెన్గా మరొకసారి బాధ్యతలు చేపట్టాడు రేవంత్. నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎడిక్షన్ ప్రీ పాస్ టాస్క్ విధించడం జరిగింది. ఇంటి సభ్యులు ఎడిక్షన్ ప్రీపాస్ స్లాట్ ను గెలుచుకోవడమే కాదు దానికి మనీ వెచ్చించాలి . మొదటి బజర్ ప్రెస్ చేసింది ఫైమా. దీనితో ఫైమా రూ.80000 వెచ్చించాల్సి ఉంటుంది. రేవంత్, ఫైమా, శ్రీహన్ ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ కి ఎంపికయ్యారు. ఈ ముగ్గురిలో ఇతర సభ్యుల మద్దతు ఎవరో ఒకరికి తెలపాలి . ఈ గేమ్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారు ఎత్తుకున్న కర్రలపై బరువు ఉంచాలి . ఈ క్రమంలోనే ఆదిరెడ్డి ఫైమా కు మద్దతు తెలుపుతూ రేవంత్ ఎలిమినేట్ కావాలని కోరుకున్నాడు.

Bigg Boss Telugu 6 highlights, November 18: Faima winning eviction-free pass and other major events at a glance - Times of India
అలాగే శ్రీహాన్ తన కర్రలపై వేసిన బరువు మోయలేక గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా కర్రపై రెండు బరువైన బాగ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ రేవంత్ కర్రపై దాదాపు పదికి పైగా బ్యాగ్స్ ఉండడంతో బరువు మోయలేక కుప్పకూలిపోయాడు. దీంతో ఈ టాస్క్ లో ఫైమా విజేతగా నిలిచి ఎడిక్షన్ ప్రీ పాస్ సొంతం చేసుకుంది. మొత్తానికైతే రూ.80 వేలు వెచ్చించి మరి ఫైమా ఎడిక్షన్ ప్రీ పాస్ సొంతం చేసుకోవడం గమనార్హం.. ఎట్టకేలకు ఫైమా అనుకుంటున్నట్టుగానే ఎలక్షన్ ప్రీ పాస్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ లో ఉండాలని రేవంత్, శ్రీహాన్ , ఆదిరెడ్డి, ఫైమా , ఇనయా, శ్రీ సత్య గట్టిగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే వీరందరూ ఒకవేళ టాప్ ఫైవ్ లో నిలిచినా..టాప్ వన్ లో ఎవరు ఉంటారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎవరు విన్నర్ అవుతారు అని తెలుసుకునేందుకు వీలు లేకుండా బిగ్బాస్ గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలుచుకుంటారు అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. మరి అన్నట్టుగానే ఆరవ సీజన్ కి విన్నర్ గా రేవంత్ ఎంపిక అవుతారా? లేక ఎవరైనా కంటెస్టెంట్ టైటిల్ గెల్చుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *