టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. అప్పుడెప్పుడో విడుదలైన `గీత గోవిందం` తర్వాత విజయ్ దేవరకొండ సక్సెస్ ముఖమే చూడలేదు. రీసెంట్ గా ఈయన `లైగ‌ర్` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ కిడ్‌ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.

భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన‌ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సొంత అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. లైగ‌ర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న‌ విజయ్ దేవరకొండకు చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రస్తుతం విజయ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడీయన చేతిలో `ఖుషి` అనే సినిమా ఉంది. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ న‌ల‌బై శాతానికి పైగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. ఇక ఖుషి అనంతరం విజయ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. విజ‌య్ తో సినిమా చేసేందుకు అర డజన్ మంది దర్శకులు క్యూ కట్టారట. ఈ లిస్టులో హరీష్ శంకర్, గౌత‌మ్‌ తిన్ననూరి, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు ఉన్నారట.

పలువురు బాలీవుడ్ దర్శకుడు సైతం కథ చెప్పి విజయ్‌ను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే విజయ్ మాత్రం ఈ అర డ‌జ‌న్ దర్శకుల్లో ఎవరికి ఓటు వేయాలో తెలియక తీవ్రంగా నలిగిపోతున్నాడట. దాదాపు అందరి స్టోరీ లైన్స్‌ నచ్చినా.. ఎవరితో సినిమా చేసేందుకు ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావడం లేదని ఇన్సైడ్‌ జోరుగా టాక్‌ నడుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండకు పెద్ద చెక్కే వచ్చిందని సినీ ప్రియులు అభిప్ర‌యాప‌డుతున్నారు. మరి హిట్టు కోసం ఆరాటపడుతున్న విజయ్ ఇప్పుడు ఏం చేస్తాడు..? ఏ దర్శకుడి వైపు మొగ్గు చూపుతాడు..? అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *