గత కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. నిజానికి కుటుంబ పెద్దగా కృష్ణ ఎన్నో మరెన్నో అద్భుతాలు సృష్టించారని చెప్పాలి. ఇకపోతే కుమారుడు రమేష్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణ ఇందిరాదేవి దంపతుల మొదటి కుమారుడైన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నటన కలిసి రాకపోవడంతో నిర్మాణరంగం వైపు అడుగుల వేశారు. నిర్మాతగా పలు ప్రాజెక్టులు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపించలేదు. ఇక కృష్ణ కుటుంబం నుంచి తరువాత హీరో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనేక సినిమాలలో తండ్రికి తగ్గ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కృష్ణ లెగసీని మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే వీరి కుటుంబం నుంచి నటిగా మంజుల ఎంట్రీ ఇచ్చింది . బాలకృష్ణతో ఒక సినిమా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల ఆగ్రహానికి భయపడి ఆమె వెనకడుగు వేసింది. అయితే ఈ సంగతి ఇలా ఉంచితే తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ కుమార్తె పద్మావతి – గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ హీరో సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు సంపాదించుకున్నారు.

Is He The Next Hero From Mahesh Babu's Family? - Movie Newsఅలా కృష్ణ బ్రతికి ఉండగానే ఆయన హీరో అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని తాత పేరు నిలబెట్టారని చెప్పవచ్చు. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని వివాహం చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పైన ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కృష్ణ అల్లుడి విజయాన్ని కూడా చూసి సంతోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వెలుగులోకి మరొక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది కూడా కృష్ణ చిన్న కర్మ రోజు బయటకు రావడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే..ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణ ప్రోత్సాహం మేరకే అమెరికా వెళ్ళిన జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు ఇక కృష్ణ మరణానంతరం ఆయన్ని కడసారి చూసుకోవడానికి జయకృష్ణ రాలేకపోయారు. కానీ అమెరికా నుంచి ప్రయాణం దూరం కావడంతో కాస్త ఆలస్యం అయింది. అయితే ప్రస్తుతం హైదరాబాదుకు చేరిన జయకృష్ణతో మహేష్ బాబు కలిసి కొన్ని ఫోటోలు దిగారు . దీన్ని బట్టి చూస్తే జయ కృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే హీరోగా ఎంట్రీ ఇచ్చి జయకృష్ణ ఏ రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *