ఇటీవల కాలంలో హీరోలు, హీరోయిన్లు చాలామంది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది.. “పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని అనుకుంటున్నాట్టుగానే” వీరు కూడా చట్టపట్టలేసుకొని తిరుగుతూ తమను ఎవరు చూడలేదని భ్రమలో మరింతగా శృతిమించి పోతున్నారు.. ఇకపోతే కొంతమంది ప్రేమ, పెళ్లిల విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా డీల్ చేస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఈ విషయాలను దాచి పెడుతూ రహస్యంగా ఎఫైర్స్ నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కూడా ఒక స్టార్ హీరోతో రహస్యంగా తిరుగుతోందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

ఇదే ప్రశ్న ఆమెను అడిగితే తమ మధ్య స్నేహబంధం తప్ప మరో సంబంధం లేదు అంటూ మాట్లాడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ స్టార్ హీరోయిన్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని విపరీతంగా అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా తన అందాలతో యువతను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన కలసి నటించింది. అయితే ఇండస్ట్రీలో ఇంత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది . ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు పెళ్లి గురించి ఖచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసి నటించిన ఒక స్టార్ హీరోతో అర్ధరాత్రి పూట లేట్ నైట్ పార్టీస్ అంటూ బాగా తిరిగేస్తోంది. ఇదిలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి వీరిద్దరూ కారులో వెళ్తూ ఉండగా మీడియా కంట పడ్డారు. వెంటనే వీరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఇది బాగా వైరల్ అయింది. దీంతో తామద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అందరూ అనుకుంటున్నారు.కానీ కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ వెల్లడించింది ఆ హీరోయిన్.

కానీ వీరి మధ్య ఏం జరుగుతోంది అని ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ గా వినిపిస్తూనే ఉంది.మరి కనీసం ఇప్పటికైనా తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెడతారా లేక ఎప్పటిలాగానే రహస్యంగా కొనసాగిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *