తెలుగు ఇండస్ట్రీలో ఏ మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది సమంత. మొదటి సినిమాతోనే స్టార్డం తెచ్చుకొని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అయిన అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లి కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.ఇక విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం సమంత తన చేతినిండా ఆఫర్లతో ముందుకు సాగుతోంది.

సమంత తాజాగా మయో సైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసాక ఎంతో మంది సెలబ్రిటీలు, అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి టైంలో నాగచైతన్య, సమంత కలిసి జీవిస్తే బాగుంటుందని వారి ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నప్పటికీ అది అంత సులువైన పని కాదు. అయితే వీరి బంధం పై ప్రముఖ జర్నలిస్టు ఈమంది రామారావు స్పందిస్తూ.. నాగ చైతన్య సమంతలకు ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. వీళ్లు డివోర్స్ తీసుకున్నప్పటికీ ఎక్కడా కూడా విడాకులు తీసుకొని విడిపోయినట్టు ప్రవర్తించలేదు.

అలాగే సమంత తన భర్త నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలు తనకే సొంతం కావాలనే ఉద్దేశంతో నాగచైతన్య సమంత కలిసి ఉన్న ఇంటిని సమంతనే దక్కించుకుంది.ఇక ఈ విషయం బట్టి అర్థం చేసుకోవచ్చు సమంతకు నాగచైతన్య పై ఇంకా ప్రేమ ఉందని.ఇక నాగార్జున కూడా సమంతను కోడలుగా ఏనాడు చూసుకోలేదు. ఎప్పుడు కూడా కూతురు లాగే అభిమానించారు. ఇక సమంతకు వచ్చిన ఆ అరుదైన వ్యాధి కేవలం మానసిక ఒత్తిడి వల్లే వచ్చింది. ఇలాంటి టైంలో నాగచైతన్య తోకలిసి ఉంటే మాత్రం ఆ వ్యాధి కచ్చితంగా నయం అవుతుంది. నాగచైతన్య సమంత కేవలం ఇగో సమస్యల వల్లే విడాకులు తీసుకున్నారు.

కానీ ఇప్పుడు ఒకవేళ సమంతకి ఇష్టం ఉంటే మళ్ళీ నాగచైతన్య సమంత కలవడం అంత కష్టమైన పని ఏం కాదు. అలాగే అమల కూడా చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. కేవలం సమంత ఇగో వల్లే విడిపోయి పెద్ద తప్పు చేసింది. అలాగే సమంత ను పెళ్లి అయ్యాక అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు గ్లామర్ పాత్రల్లో నటించవద్దని చెప్పుకొచ్చారు. కానీ సమంత వాటిని వినలేదు అందుకే వారికి గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లారు. ఒకవేళ సమంత మళ్ళీ తన ఆలోచనలు మార్చుకొని విడాకులు రద్దు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమంత ప్రస్తుతం ఉన్నపరిస్థితిలో కచ్చితంగా నాగచైతన్య తోడు అనేది ఆమెకు ఎంతో అవసరం అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈమంది రామారావు చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *