ప్రముఖ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవాల్సిన కృష్ణభగవాన్.. తాను చేసిన కొన్ని తప్పుల వల్లే తన కెరీర్ నాశనం చేసుకున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మొదట్లో 1988 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన కృష్ణ భగవాన్ కి 2002 వరకు ఏ ఒక్క సినిమాతో కూడా మంచి బ్రేక్ రాలేదని చెప్పవచ్చు. కానీ 2002 చివరిలో వచ్చిన రవితేజ సినిమా “అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” సినిమాతో కృష్ణ భగవాన్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి . ఈ సినిమాలో ఆయన పంచ్ లకు జనాలు కడుపుబ్బా నవ్వడమే కాకుండా ఆయనకు సాలిడ్ హిట్టు కూడా అందించారు.

అంతేకాదు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వెనుతిరిగి చూసుకోలేదు. అలా 2002 నుంచి 2018 వరకు కృష్ణ భగవాన్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ” ఏప్రిల్ ఒకటి విడుదల” సినిమాకు రైటర్ గా పని చేసిన ఈయన “ఊహలు గుసగుసలాడే ” సినిమాకు నరేషన్ కూడా చేశారు. ఆ తర్వాత 2020లో మరొకసారి “రాగల 24 గంటలలో” అనే సినిమా కోసం కూడా రైటర్ గా మారి.. తన సత్తా చూపించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే.

John Apparao 40+ Movie Songs - Ennenno - Krishna Bhagavan, Simran - video  Dailymotion

అయితే కమెడియన్ గా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు “జాన్ అప్పారావు 40+” సినిమా చేయగా అందులో హీరోగా కృష్ణ భగవాన్ , హీరోయిన్గా సిమ్రాన్ నటించింది. ఆ తర్వాత “బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్” సినిమాలో అల్లరి నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకొని రెండవ హీరోగా కూడా లీడ్రోల్ పోషించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ సినిమాలలో హీరో పాత్రలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

అయితే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిన కృష్ణభగవాన్ ఇలా కెరియర్ నాశనం చేసుకోవడానికి కారణం ఆయనకున్న చెడు వ్యసనాల వల్లే తన కెరియర్ను నాశనం చేసుకున్నారు అని తెలుస్తోంది. అంతేకాదు క్రమశిక్షణ కూడా లేనందువల్ల దర్శక నిర్మాతలు ఈయనకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఈ క్రమంలోనే క్రమంగా అవకాశాలు కోల్పోయిన కృష్ణ భగవాన్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఆయనకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *