సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇక ఈయన నవంబర్ 15 మంగళవారం రోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించారు. కృష్ణ మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఒంటరి అయిపోయింది.ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాదిలో రెండు మరణాల చోటు చేసుకున్నాయి ఇక కృష్ణ కూడా మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీలో పెద్దదిక్కు లేకుండా పోయింది. ఇక కృష్ణ సినీ ఇండస్ట్రీలో 350 పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతోమందిని అలరించారు.

తెలుగు తెరపై సూపర్ స్టార్ అని చెరగని ముద్ర కూడా వేసుకున్నారు.అలాంటి కృష్ణ కు హార్ట్ ఎటాక్ రావడం తో కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ నటశేఖరుడు ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్నుమూశారు. ఇక ఎందరో కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య ఇంకెందరో సినీసెలబ్రిటీల,రాజకీయ నాయకుల,అభిమానుల అశ్రునయనాల మధ్య కృష్ణ గారి అంత్యక్రియలు బుధవారం రోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి.తండ్రిపార్థివ దేహానికి మహేష్ బాబు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఇలాంటి గొప్ప నటుడికి కనీసం వారి సొంత స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించి ఓ స్మారక మందిరం కట్టడం కూడా తెలియదా? ఇలా అందరిలాగే మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడం ఏంటి? అంటూ చాలామంది అభిమానులు మహేష్ బాబు పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడం పై తాజాగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ మేము అన్నయ్య అంత్యక్రియలు ఇక్కడ చేయడానికి ఒక కారణం ఉంద..అదేంటంటే.. మా అన్నయ్య మొదటి భార్య మా వదిన ఇందిరా దేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలోనే నిర్వహించాం, అలాగే మా అన్న పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు కూడా మహాప్రస్థానంలోనే జరిపాము.

ఇక వీళ్ళందరూ మరణంలో కూడా ఒకే దగ్గర ఉండాలనే కారణంతో మా అన్న కృష్ణను ను కూడా మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు నిర్వహించాం.ఇక మరోవైపు సూపర్ స్టార్ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ అలాగే నిలిచిపోయేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.త్వరలోనే కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన షీల్డ్ లు,ఇతర వివరాలు, ఫోటోలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.త్వరలోనే ఈ మెమోరియల్ పై ఘట్టమనేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటన ఇవ్వబోతోందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *