ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సి. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించారు.ఇక కొన్ని రోజులు టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన తాప్సి అనుకోకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. బాలీవుడ్లో తాప్సి సినీ కెరియర్ బాగానే ఉంది. ఇక తెలుగులో ఒక్క అవకాశం రాకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. దానికి కారణం ఆమె డెడికేషన్, కష్టం అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే తాప్సీ ఎన్నో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని అందులో నటిస్తోంది. అందుకే బాలీవుడ్ లో ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఇక మొదట తెలుగులో నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. వచ్చినా కూడా అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీ పై నిరాశపడి బాలివుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక బాలీవుడ్ కి వెళ్ళాక తాప్సీ రేంజ్ మారిపోయింది.

ఈమె నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండడంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను బాగా ఆదరించారు. అక్కడ స్టార్ హీరోయిన్ లెవెల్ కి వచ్చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాప్సీ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలోనే మోహన్ బాబు కొడుకు విష్ణు తో ప్రేమలో పడిందట. కానీ తాప్సీ ప్రేమను మంచు విష్ణు పట్టించుకోలేదట. ఇక ఈ విషయం గ్రహించిన తాప్సి విష్ణు మీద ఉన్న బాధతో కోపంతో టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్లోకి వచ్చేసిందని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

అంతేకాదు తాప్సి ఆ హీరోకి కొన్ని శాపనార్థాలు కూడా పెట్టిందట. అయితే తాప్సి పెట్టిన శాపనార్ధాలు మంచు విష్ణువుకి ఇప్పుడు తగిలాయి అందుకే ఆయన కెరీర్ ఇలా డీలా పడిపోయింది. వరుస సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి అంటూ కొంతమంది నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆడదాని ఉసురు ఊరికే పోదు ఏదో ఒక టైం లో అది ఖచ్చితంగా తగులుతుంది ఇప్పుడు తాప్సి శాపం మంచు విష్ణుకు తగిలింది అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *