టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ గారు మరణించిన సంగతి మనకు తెలిసిందే.హార్ట్ ఎటాక్ రావడంతో కోడలు నమ్రత ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటూ కృష్ణ గారు మరణించారు. ఇక కృష్ణ మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మన తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణ గారికి ఉన్న ప్రత్యేకత మరొక హీరోకి లేదని చెప్పుకోవచ్చు. ఈయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా చాలామంది మెప్పు పొందారు.అయితే ఈయనకు నటన రాదు అని ఏడిపించే వాళ్ళు కూడా అనేకం మంది ఉన్నారు.

కానీ వారెవరిని పట్టించుకోకుండా ఆయన సినీ రంగంలో రాణించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే కృష్ణ తన జీవితంలో చేసిన 3 తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తన కూతురు మంజుల నటి కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుందట. కానీ కృష్ణ తన కూతురు హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే కృష్ణ అభిమానులు మంజులని హీరోయిన్గా చేస్తే ఒప్పుకోమని తెగేసి చెప్పడంతో ఆయన తన కూతురు కల నెరవేరకుండా చేశారు. ఇక మంజుల కూడా తన కుటుంబ నేపథ్యం, తండ్రి అభిమానుల వల్ల తాను అనుకున్నది చేయలేకపోయానని ఇప్పటికి కూడా బాధ పడుతుందట.

అలాగే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కృష్ణ వ్యవహరించిన తీరు లో అప్పట్లో అందరూ కృష్ణ పై మండిపడ్డారు. కృష్ణ కి బాలసుబ్రమణ్యం కి మధ్య వైరం ఏర్పడడానికి కారణం వేటూరి సుందర రామ్మూర్తి అని సమాచారం. బాలసుబ్రమణ్యం విషయంలో కృష్ణ చెప్పుడు మాటలు వినడం వల్లే వారి మధ్య గొడవ వచ్చిందని సినీ ఇండస్ట్రీలో వాళ్లు అనుకునేవారట. అలాగే కృష్ణ గారు చేసిన మూడో పొరపాటు దర్శకుడు రేలంగి నరసింహారావుతో వివాదం. రేలంగి,హీరో శోభన్ బాబుతో కలిసి సంసారం అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో తన బంధువైన శాఖమూరి రామచంద్రరావు నిర్మాత గా రేలంగి నరసింహ రావుతో ఓ సినిమా చేస్తానని కృష్ణ మాట ఇచ్చారట.

ఇక కృష్ణ మాట ఇవ్వడంతో రేలంగి నరసింహారావు రచయిత సత్యానంద్ తో సినిమా సెట్టింగ్స్ మొదలుపెట్టారట. కానీ ఈ సినిమా నిర్మాత ఎవరికి తెలియకుండా పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత రేలంగి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పారట. దాంతో రేలంగి నరసింహారావు కోపం తెచ్చుకున్నారట. నేను ఇప్పటికే రచయిత సత్యానంద్ తో సెట్టింగ్స్ కూడా మొదలుపెట్టాక ఇలా మీరు పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ ఇవ్వడం ఏమీ బాగాలేదు, సెట్టింగ్స్ కూడా మొదలుపెట్టాక సత్యానంద్ ని తీసేస్తే ఎలా ఉంటుందని నిర్మాతతో రేలంగి చెప్పారట. ఇలా వారిద్దరూ సినిమా నుండి తప్పుకున్నారు. కానీ రేలంగికి మాత్రం కృష్ణ ఆ నిర్మాతతో సినిమా చేయడం ఇష్టం లేదని చెప్పారట.ఇక అసలు విషయం తెలుసుకోని కృష్ణ రేలంగి నరసింహారావు తో వివాదం పెంచుకున్నారు. ఇలా తన జీవితంలో కృష్ణ గారు మూడు పొరపాట్లు చేశారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *