సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కలిసి ఉన్న ఇంటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.. ఇంద్రభవనాన్ని మించిన ఆ ఇల్లు.. అందులోని ప్రత్యేకతలు చూస్తే మాత్రం ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతలా కృష్ణ , విజయనిర్మల కలిసి ఆ ఇంటిని నిర్మించుకున్నారు. గతంలో హైదరాబాద్ నగర శివారులలో ఉండే ఈ ఇల్లు ఇప్పుడు సిటీలోకి కలిసిపోయిన నానక్ రామ్ గూడా విలేజ్ లో ప్లానెట్ 10 అనే ప్లేస్ ఉంది. అదే కృష్ణ ఉండే ఇంటి పేరు.. ఆ పేరును కృష్ణ భార్య విజయనిర్మల పెట్టుకున్నారు. 2019లో జూన్లో ఆమె మరణించడం అప్పటినుంచి కృష్ణ అక్కడే ఒంటరిగా ఉంటున్నారు. వీకెండ్ లో మాత్రమే కుటుంబ సభ్యులంతా ఒకచోట కలిసేవారు. కానీ విజయనిర్మల మరణించిన తర్వాత కృష్ణ బాగోగులను దగ్గరుండి నరేష్ మాత్రమే చూసుకుంటూ వచ్చారు.

అయితే ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్కు తరలించినప్పటికీ.. ట్రీట్మెంట్ కు శరీరం సహకరించక ఆయన స్వర్గస్తులయ్యారు. ఇకపోతే సెలబ్రిటీల ఇళ్లతో పోలిస్తే కృష్ణ ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది . ఎంట్రన్స్ లోనే.. రుచికరమైన రకరకాల పండ్ల తోటలు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత పక్షుల కిలకిల రావాలు.. రకరకాల మొక్కల పొదరిల్లు.. తరహాలో ఆ ఇంటిని చాలా అద్భుతంగా నిర్మించారు కృష్ణ. ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఒక వనాన్ని తలపించే రీతిలో అక్కడి చెట్లు.. మొక్కలు.. వాటి పొదల మధ్య గోపాలకృష్ణుడి విగ్రహము.. ఇంటి ముందు గులాబీ మొక్కలు మధ్య వాటర్ ఫౌంటెంట్.. తులసి, దానిమ్మ, మామిడి , అరటి, కూరగాయలు ఇలా ఎన్నో మనకు తారసపడతాయి. అలాగే ఇంటి ఆవరణలో విజయనిర్మల కాంస్య విగ్రహం.. పక్కనే ప్లే గ్రౌండ్, ఆ పక్కనే స్విమ్మింగ్ ఫూల్ ఇలా ఎన్నో మనం చూడవచ్చు.

విశాలవంతమైన ఒక హోమ్ థియేటర్.. ప్లేయింగ్ రూమ్ లో గోడమీద చత్రపతి శివాజీ గెటప్ లో ఉన్న కృష్ణ ఫోటో అందరిని బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇప్పటివరకు ఆయన సాధించిన అవార్డులు, రివార్డులు, విజయనిర్మల కు సంబంధించిన అవార్డులు, రివార్డులు అన్నీ కూడా కృష్ణ ఇంటిలో ప్రత్యేకంగా ఒక గదిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కృష్ణ ఉంటారు. ఇదివరకు మెట్లు ఎక్కే వెళ్లేవారు.

కానీ విజయనిర్మలకు మోకాలు నొప్పులు రావడంతో కొంతకాలం క్రితం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి రాకపోకలన్నీ ఆ లిఫ్ట్ ద్వారానే జరిగేవి. మొత్తానికి అయితే ఇంతటి అద్భుతమైన ఇంటిని కృష్ణ కూతురు మంజుల తన కెమెరాలో బంధించి వీడియో రూపంలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *