హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ప్రాంగణంలో ఉన్న ప్రముఖ సంస్థ గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఒక జూనియర్ నటి సునీత బోయ నగ్నంగా కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. గీత ఆర్ట్స్ లోని కొంతమంది వ్యక్తులు తనను గత నాలుగు సంవత్సరాల నుంచి మానసికంగా వేధిస్తున్నారని , ఈ విషయంపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోవడంలేదని కూడా ఆమె వాపోయింది. అయితే ఇది చూసిన కొంతమంది ఈమె కావాలని పబ్లిసిటీ కోసం ఇలా నగ్నంగా రోడ్డుపై కూర్చొని పాపులారిటీ దక్కించుకుంటోంది. గతంలో శ్రీరెడ్డి.. ఇప్పుడు సునీత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అవకాశాల కోసం టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇలా నగ్నంగా రోడ్లపైకి రావడం ఏంటి ? అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Boya Sunitha: Geetha Arts వద్ద Bunny Vasuకు వ్యతిరేకంగా ఆందోళన - Telugu  Oneindia

నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాత బన్నీ వాసు తనను శారీరకంగా , మానసికంగా వాడుకున్నాడు అంటూ ఆమె గతంలో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆమెను పోలీసులు తీసుకెళ్లడం.. తల్లిదండ్రులకు అప్పగించడం లేదా మెంటల్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. ఇలా రెండు మూడు సార్లు జరిగినా కూడా సునీత బోయలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఈసారి ఏకంగా నగ్నంగా ఆమె రోడ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. బన్నీ వాసు మోసం చేశాడు అంటూ నానా రచ్చ చేసింది.

నిర్మాత బన్నీ వాసుని టార్గెట్ చేస్తూ అతని మీద ఆరోపణలు చేస్తూ వస్తోంది . ఇలాగే పలుమార్లు ఫిలిం ఛాంబర్ ఎదుట అలాగే గీత ఆర్ట్స్ ఆఫీస్ బయట నుంచి నానా హంగామా చేసింది.. నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడు అంటూ పలుమార్లు ఆరోపించింది. ఈ వ్యవహారం హై కోర్టు వరకు వెళ్లినా సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును కొట్టి పడేసింది . అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న సునీత మళ్ళీ ఇప్పుడు రచ్చ చేసింది.. అంతేకాదు తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటూ మొండికేసింది. పోలీసులు నచ్చచెప్పనా వినలేదు. చివరికి ఒక యువతి ఆమె ఒంటి మీద వస్త్రాలు లేకపోవడంతో వస్త్రాలు కప్పింది.

నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్డు మీద సునీత నగ్నంగా బైటాయించడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అయితే ఇది చూసిన కొంతమంది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని అందుకే కావాలనే బన్నీ వాసుని టార్గెట్ చేస్తుంది అంటూ కూడా తెలుపుతున్నారు. మరికొంతమంది ఏదో జరిగే ఉంటుంది.. లేకపోతే ఎందుక ఇంతలా నిరసన చేస్తుందంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బన్నీ వాసుకి మాత్రం ఈ అమ్మాయి ఒక పీడలాగా పట్టుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://www.youtube.com/shorts/kiwWcZ1VV5g

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *