బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటు..అనీల్ మార్క్ వినోదం ఈ సినిమాలో ఉండబోతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా ను మొదలుపెట్టబోతున్నారు. సంక్రాంతి కి వీర సింహ రెడ్డి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు ఆ సినిమాపైనే ఉంది.

ఇక అనిల్ రావిపూడి సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే బాలయ్యకి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ని దింపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి ని ఎంపిక చేయబోతున్నారట.

ఈమె గతంలో తెలుగు సినిమా చేయకపోయినా సౌత్ లో పలు సినిమాలు చేసింది. అయితే బాలయ్య అభిమానులు మాత్రం కాస్త దీనిపట్ల అసహనంగా ఉన్నారు. హ్యూమా కన్నా బెటర్ గా…కాజల్ అగర్వాల్… నిత్యామీనన్ లాంటి వాళ్లు అయితే బాగుంటుందని నెటి జనులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *