పెళ్లి చూపులు సినిమా తో దర్శకుడిగా మంచి సక్సెస్ సాధించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత అలంటి సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయాడనే చెప్పాలి. ఈ నగరానికేమైంది సినిమా మోస్తరుగానే విజయం సాధించగా మళ్ళీ అయన దర్శకత్వంలో సినిమా ఇప్పటిదాకా రాలేదు. అయితే నటుడిగా ఇండస్ట్రీ లో కొనసాగాడు. కొన్ని మంచి పాత్రలు చేశాడు.

అయితే తాజాగా ఆయన దర్శకత్వంలో మరో సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చాడు. వీజీ సైన్మా క్విక్ ఫాక్స్.. బ్యానర్ ల పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘కీడా కోలా’ భారీ కాంట్రవర్శియల్ సబ్జెక్ట్ నే తరుణ్ భాస్కర్ ఈ మూవీతో డీల్ చేయబోతున్నట్టుగా స్పష్టమవుతోంది.

బాటిల్ డక్కన్.. రక్తం చిమ్ముతున్న బొద్దంకని టైటిల్ లో చూపించిన తీరుని బట్టి తరుణ్ భాస్కర్ ఈ సారి కూల్ డ్రింక్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మూవీని సంచలన కథనంతో తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా అయన ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *