కన్నడ లో తెరకెక్కిన కాంతారా సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. తెలుగులో ఊదా ఈ సినిమా కి మంచి కితాబు దక్కుతుంది. ఎక్కువ ప్రమోషన్స్ చేయకున్నా రోజు రోజుకూ బజ్ పెరిగింది. అలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ను ధియేటర్ లలో మిస్ అయిన చాలామంది ఓటీటీ లో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీతీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు.

కానీ, థియేటర్లలో విశేష స్పందన రావడంతో ఓటీటీ స్ట్రీమ్ ను వాయిదా వేశారు. దాంతో దీన్ని 24 వ తేదీకి మార్చారు. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *