టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకొని.. అందరి హీరోలతో కలిసి నటించిన మరింత పాపులారిటీని దక్కించుకున్న ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పుడు ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం రాజకీయాలలో మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ లో చేస్తున్న జడ్జి పదవికి.. రాజీనామా చేసి రాజకీయాలలోకి వెళ్లిపోయి అక్కడ చక్రం తిప్పుతున్నారనే చెప్పాలి. ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ తన గుర్తింపును మరింత పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రోజా..

Minister Roja Daughter: మినిష్టర్ రోజా కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీకి  అంతా సిద్ధం.. హీరో ఎవరంటే..? | Minister Cum Actress Roja Daughter Anshu  Malika Ready to Entry As Heroine in Big ...

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి రోజా గారాలపట్టి అన్షు మాలిక త్వరలోనే హీరోయిన్ గా నటించబోతుందని.. ఒకవేళ ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంతేకాదు రోజా ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్టు.. ఒక మంచి కథ , హీరో దొరికితే కచ్చితంగా తన కూతుర్ని హీరోయిన్ చేస్తుందంటూ కూడా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది రోజా..

రోజా మాట్లాడుతూ.. తన కూతురికి అసలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఆలోచన లేదు అని తెలిపింది.. ఇక ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేశారు. శ్రీవారిని దర్శించుకున్న రోజా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ. స్వామి వారి దివ్య స్వరూపము ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. మర్చిపోలేము అంటూ కూడా వ్యాఖ్యానించింది.

అలాగే తన కూతురు అన్షు సినిమాల్లోకి అడుగు పెట్టాలన్న వార్తల్లో నిజం లేదు . తాను ఇంకా చదువుకుంటుంది. సైంటిస్ట్ కావాలనే కోరిక తోనే తాను బాగా కష్టపడుతోందని రోజా తెలిపింది. ప్రస్తుతం తాను సైంటిస్ట్ అవ్వాలనే కోరిక వైపే అడుగులు వేస్తోంది. మరి భవిష్యత్తు ఎలా జరగబోతుందో తనకు తెలియదంటూ రోజా చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *